YSR Cheyutha 2021: వైఎస్సార్‌ చేయూత పథకం.. ఆ మహిళల బ్యాంక్ ఖాతాల్లో రూ.18,750 జమ

YSR Cheyutha Amount: వరుసగా రెండో ఏడాది వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లబ్ధిదారులైన మహిళల బ్యాంకు ఖాతాల్లో వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.18,750 చొప్పున జమ చేశారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 22, 2021, 01:53 PM IST
  • అక్కాచెల్లెమ్మల ఆర్ధిక స్వావలంబన కోసం వైఎస్సార్ చేయూత
  • వరుసగా రెండో ఏడాది వైఎస్సార్ చేయూత నిధులు విడుదల
  • ఆ మహిళల బ్యాంకు ఖాతాలకు రూ.18,750 జమ చేసిన ఏపీ సీఎం
YSR Cheyutha 2021: వైఎస్సార్‌ చేయూత పథకం.. ఆ మహిళల బ్యాంక్ ఖాతాల్లో రూ.18,750 జమ

YSR Cheyutha Scheme: అక్కాచెల్లెమ్మలకు తన వంతు సాయంగా వారి ముఖాలలో వెలుగు నింపడానికి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం వైఎస్సార్‌ చేయూత (YSR Cheyutha). వరుసగా రెండో ఏడాది వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లబ్ధిదారులైన మహిళల ఖాతాల్లో వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.18,750 చొప్పున జ చేశారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) వరుసగా రెండో ఏడాది వైఎస్సార్ చేయూత (YSR Cheyutha 2nd Phase) నిధులను మహిళల ఖాతాల్లో జమ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు మహిళలకు రూ.18,750 బ్యాంకు ఖాతాలకు జమ అయ్యేలా అన్ని ఏర్పాట్లు చేశారు. మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించడం, వారికి చేయూతగా ఉండటంలో భాగంగా ఈ ఏడాది 23.14 లక్షల మంది మహిళలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మొత్తం రూ.4,339 కోట్లు విడుదల చేశారు.

గత ఏడాది సైతం దాదాపు 23 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన అక్కాచెల్లెమ్మలకు వైఎస్సార్ చేయూత తొలి విడత ప్రయోజనం చేకూరింది. నాలుగేళ్లలో ఒక్కో అక్కాచెల్లెమ్మకు మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం అందించడంలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan Mohan Reddy) ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో నేడు రెండో విడుత నగదుతో కలిపి ఇప్పటివరకూ రూ.37,500 ప్రయోజనం పొందారు. ఓవరాల్‌గా రూ.8,943.52 కోట్లు వెచ్చించారు. రిలయన్స్, అమూల్, ఐటీసీ సంస్థలతో ఒప్పందాల ద్వారా దాదాపు 78 వేల మంది మహిళలు కిరాణా షాపులు పెట్టుకున్నారని పేర్కొన్నారు.

 

Trending News