Tirumala Laddu Animal Ghee: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వరుడి ప్రసాదం లడ్డూపై తీవ్ర రాజకీయ దుమారం ఏర్పడింది. ప్రపంచ ఖ్యాతి పొందిన తిరుమల లడ్డూ తయారీకి జంతువుల నెయ్యి వాడారని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడం కలకలం రేపాయి. పవిత్రమైన తిరుమల ఆలయంపై అలాంటి వ్యాఖ్యలు చేయడం రచ్చ రేపుతోంది. కాగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఖండించారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని హితవు పలికారు.
Also Read: Pawan Kalyan: భూమి కొంటే ఆ పత్రంపై జగన్ బొమ్మ ప్రత్యక్షం.. డిప్యూటీ సీఎం పవన్‌కు విచిత్ర అనుభవం
తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల 'ఎక్స్' వేదికగా స్పందించారు. 'తిరుమలను అపవిత్రం చేస్తూ, హిందువుల మనోభావాలను, దెబ్బతీసేలా తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్‌సీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయి' అని అసహనం వ్యక్తం చేశారు. 'ముఖ్యమంత్రి హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రత, ప్రతిష్టకు భగం కలిగించేలా ఉన్నాయి' అని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: Chandrababu House: చట్టానికి చంద్రబాబు చుట్టం కాదు.. ఆయన ఇల్లు కూల్చివేయాల్సిందే!
'కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయి. చంద్రబాబు చేసిన ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే.. భావోద్వేగం మీద రాజకీయం చేసే ఉద్దేశమే మీకు లేకుంటే.. నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయాలి' అని షర్మిల డిమాండ్ చేశారు. సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. 'మహా పాపానికి.. ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి' అని సవాల్ విసిరారు. 'చంద్రబాబు తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలని.. నిజాలు నిగ్గు తేల్చాలి' అని షర్మిల డిమాండ్ చేశారు. తిరుమల ప్రసాదంపై సీఎం చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తిప్పికొట్టింది. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ విజయ సాయిరెడ్డి మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు.
తిరుమలను అపవిత్రం చేస్తూ, హిందువుల మనోభావాలను,
దెబ్బతీసేలా @JaiTDP టీడీపీ, @YSRCParty వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయి. సిఎం హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భగం కలిగించేలా ఉన్నాయి.…— YS Sharmila (@realyssharmila) September 19, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.