YS Sharmila: పంజరంలో చిలక మాదిరిగా ఉన్న ఏసీబీని వైఎస్‌ జగన్‌ కోసం వదలాలి

YS Sharmila Demands ACB Probe On YS Jagan Gautam Adani Bribe: గౌతమ్‌ అదానీ లంచం వ్యవహారంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను కాంగ్రెస్‌ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వదిలిపెట్టడం లేదు. ఆ వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తు చేపట్టాలని కోరుతూ వినూత్న రీతిలో డిమాండ్ చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 5, 2024, 03:28 PM IST
YS Sharmila: పంజరంలో చిలక మాదిరిగా ఉన్న ఏసీబీని వైఎస్‌ జగన్‌ కోసం వదలాలి

YS Jagan Gautam Adani Bribe: గౌతమ్‌ అదానీ - వైఎస్‌ జగన్ రూ.1,750 కోట్ల ముడుపులపై ఏసీబీ దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి డిమాండ్‌ చేశారు. ఏసీబీ వ్యవస్థను కూటమి ప్రభుత్వం పంజరంలో పెట్టిందని ఆరోపించారు. పంజరం నుంచి ఏసీబీని విడుదల చేయాలని కోరారు. అదానీ ఒప్పందంపై కోర్టును ఆశ్రయించిన టీడీపీ ఇప్పుడు ఎందుకు మౌనం పాటిస్తోందని నిలదీశారు. అదానీ జగన్‌ కలిసి రాష్ట్ర ప్రజలపై రూ.లక్ష కోట్ల ఆర్థిక భారం మోపారని ఆరోపించారు.

Also Read: Nara Lokesh: లోకేశ్‌ను కలిసిన దేవర 'డ్యాన్సర్‌'.. తనను ఆదుకున్నందుకు కృతజ్ఞతలు

విజయవాడలోని ఏసీబీ కార్యాలయం ఎదుట గురువారం ఏపీసీసీ ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. పంజరంలో ఏసీబీ బందీ అయ్యిందంటూ పంజరం పట్టుకుని వైఎస్‌ షర్మిల నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... 'అదానీపై అమెరికాలో దర్యాప్తు జరుగుతోంది. సౌర విద్యుత్‌ ఒప్పందంలో జగన్‌కి రూ.1,750 కోట్లు ముడుపులు ఇచ్చారని అమెరికా ఎఫ్‌బీఐ వెల్లడించింది. ఆధారాలు కూడా బయట పెట్టింది' అని షర్మిల వివరించారు.

Also Read: Naga Babu: అల్లు అర్జున్ కోసం రంగంలోకి నాగబాబు.. వెనక్కి తగ్గిన జనసేన పార్టీ

'ఇంత జరుగుతుంటే దర్యాప్తు సంస్థలు నిద్ర పోతున్నాయా ? ఇంత అవినీతి జరిగితే మన రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు ఎందుకు బయటపెట్టలేదు?' అని వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. '2021లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ సౌర విద్యుత్‌ ఒప్పందంపై హైకోర్టులో పిటీషన్ కూడా వేశారు. ఇదొక కుంభకోణం అని రాష్ట్ర ప్రజలపై రూ.లక్ష కోట్ల ఆర్థిక భారం అని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. అదానీ ఒప్పందం వెనుక అవినీతి జరిగిందని తెలుసు. ఇప్పుడు మీరే అధికారంలో ఉండి ఏం చేస్తున్నారు' అని నిలదీశారు.

'జగన్‌కి నష్టం లేదు.. మీకు నష్టం లేదు. నష్టం జరిగేది రాష్ట్ర ప్రజలకు మాత్రమే. అదానీతో 25 ఏళ్ల ఒప్పందం అంటే రాష్ట్రం నెత్తిన అధికార భారం పడుతుంది' అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. 'అదానీ మీద మీరు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? అదానీ అనే పేరు కూడా ఎందుకు ఉచ్ఛరించడం లేదు? అదానీ బీజేపీ మనిషి.. మోడీ మనిషి. బీజేపీతో మీకు మైత్రి ఉంది. అందుకే మీరు అదానీకి, మోడీకి భయపడుతున్నారు' అని షర్మిల చెప్పారు.

'అమెరికా దర్యాప్తు సంస్థలు చెప్తే కానీ అవినీతి బయటకు రాలేదు? ఈ అవినీతి బయట పెట్టని సీబీఐ చేతకానిదా? మోడీ చేతకాని వాడా?' అని షర్మిల ప్రశ్నించారు. ఏసీబీ స్వయం ప్రతిపత్తి గల సంస్థ కానీ రాష్ట్రంలో బందీ చేశారు. పంజరంలో చిలక మాదిరిగా బందీ చేశారు' అని తెలిపారు. అదానీ జగన్‌ లంచాల వ్యవహారాన్ని ఏసీబీ బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి దర్యాప్తు చేపట్టాలని కోరారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News