YS Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల.. అధికారిక ప్రకటన వచ్చేసింది

APCC President YS Sharmila: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇక రాష్ట్రంలో అన్న-చెల్లెల మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది.   

Written by - Ashok Krindinti | Last Updated : Jan 16, 2024, 03:37 PM IST
YS Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల.. అధికారిక ప్రకటన వచ్చేసింది

APCC President YS Sharmila: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులిచ్చారు. ఇటీవల వైఎస్ఆర్టీపీని విలీనం చేసిన షర్మిల.. హస్తం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఏపీ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఎంపిక చేశారు. షర్మిల రాకతో ఏపీలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం వస్తుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇక అన్న-చెల్లెలు వార్ ఎలా ఉండబోతుందోనని ఆసక్తికరంగా మారింది.

తనను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించడంపై వైఎస్ షర్మిల స్పందించారు. కాంగ్రెస్ అగ్ర నాయకులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణు గోపాల్‌కు ధన్యవాదాలు తెలిపారు. తనను నమ్మి అధ్యక్ష పదవి అప్పగించారని.. ఏపీలో కాంగ్రెస్ పూర్తి నిబద్ధత, చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని పూర్వ వైభవంగా పునర్నిర్మించడానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నానని ట్వీట్ చేశారు. ప్రతి కాంగ్రెస్ సైనికుడితో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నానని అన్నారు. రుద్రరాజు గిడుగు, పార్టీలోని ప్రతి ఇతర నాయకుల అనుభవంతో  నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలనుకుంటున్నట్లు రాసుకొచ్చారు.
 

 

Also Read: Happy Kanuma Wishes 2024: కనుమ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియా మెసేజెస్..

Also Read: Chandrababu Case: క్వాష్ కొట్టివేత, ద్విసభ్య ధర్మాసనంలో ఎవరేమన్నారంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News