రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు కనిపించడంలేదు: కన్నా లక్ష్మినారాయణ

రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు కనిపించడంలేదు: కన్నా లక్ష్మినారాయణ

Last Updated : Oct 10, 2019, 02:16 PM IST
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు కనిపించడంలేదు: కన్నా లక్ష్మినారాయణ

అమరావతి: జగన్ అధికారం చేపట్టి నాలుగు నెలలైందని.. ఈ నాలుగు నెలల్లో పోలవరం పనుల్లో ఎంతమేర పురోగతి సాధించారో పరిశీలించేందుకు రేపు పోలవరం ప్రాజెక్టును బీజేపీ బృందం సందర్శించనున్నట్టు ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగినట్లు ప్రాథమిక సమాచారం ఉందన్న కన్నా లక్ష్మీనారాయణ.. పోలవరం ప్రాజెక్టులో జర్మనీ పరికరాల స్థానంలో చైనా సామాగ్రి ఉపయోగిస్తున్నట్లు సమాచారం అందిందని అన్నారు. రివర్స్ టెండరింగ్‌తో పోలవరం ప్రాజెక్టు వ్యయం తగ్గిందని వైఎస్ జగన్ సర్కార్ చెబుతుండటాన్ని ప్రస్తావించిన కన్నా.. ఒకవేళ ప్రాజెక్టు వ్యయం తగ్గితే మంచిదేనని, అయితే నాణ్యత కూడా ముఖ్యమేనని అన్నారు. అంతేకాకుండా ప్రాజెక్ట్ పూర్తయ్యాకే వ్యయం తగ్గిందా.. పెరిగిందా అనేది తెలుస్తుందన్నారు. 

తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిల గురించి చెబుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జగన్‌కు మంచి సంబంధాలున్నాయని, అందుకే విభజన అంశాలు త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు. సీఎం వైఎస్ జగన్ వైఖరి చూస్తోంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు కనిపించడంలేదని.. వారి కార్యకర్తలకు పంపకాలు బాగానే చేస్తున్నారు కదా అని కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు.
 

Trending News