'కరోనా వైరస్' ఉద్ధృతమవుతున్న వేళ భారత దేశంలో లాక్ డౌన్ ను మే 17 వరకు పొడగించారు. ఈ క్రమంలో నేటి నుంచి మూడో దశ లాక్ డౌన్ ప్రారంభమైంది. మరోవైపు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కేంద్రం మరిన్ని ఆంక్షలను సడలించింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల కేంద్రం ఇచ్చిన సడలింపులతో కార్యకలాపాలకు అనుమతిస్తున్నాయి. అదే కొన్ని రాష్ట్రాలు మాత్రం ఇంతకు ముందు ఉన్న విధంగానే లాక్ డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి ఇప్పటికీ తగ్గలేదు. రెండు రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఐతే కేంద్రం ఇచ్చిన తాజా మార్గదర్శకాలను అమలుచేయడంలో రెండు రాష్ట్రాల్లో విభిన్న వైఖరి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రం మార్గదర్శకాలను అనుసరిస్తూ .. కొన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. కానీ తెలంగాణలో ఇప్పటి వరకు ఉన్న లాక్ డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం కంటే ముందుగానే మే 7 వరకు లాక్ డౌన్ పొడగించారు.
మద్యం షాపుల వద్ద నిబంధనలు ఇలా..
కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చారు. అంతే కాకుండా మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన వారు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాల్సి ఉంటుంది. మద్యం దుకాణాల వద్ద ఒకేసారి ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంది. ఒకవేళ రద్దీ ఎక్కువైతే కాసేపు దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. మద్యం దుకాణాల్లో అమ్మేవారితోపాటు కొనుగోలుదారులు అంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన రేట్లు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మద్యం ధరలు పెంచినట్లుగా తెలుస్తోంది. మరోవైపు వైన్ షాపులు తప్ప బార్లు, రెస్టారెంట్లు తిరిగి తెరిచేందుకు అనుమతి ఇవ్వలేదు.
మద్యం దుకాణాల అనుమతిపై రేపు క్లారిటీ..!!
ఇటు తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు షాకిచ్చింది. తెలంగాణలో మే 7 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఈ నేపథ్యంలో మద్యం షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వలేదు. రేపు (మంగళవారం) తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ క్రమంలో మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చే విషయంపై స్పష్టత రానుంది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..