ఏపీ, యానాంలోని ట్రోపోస్పిరిక్ వాతావరణంలో తూర్పు, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో..మరో మూడ్రోజులపాటు వర్షసూచన జారీ అయింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మూడ్రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. ఉత్తర కోస్తా ప్రాంతాలు, పుదుచ్చేరిలో ఒకటి రెండు చోట్ల మాత్రమే వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం కూడా కోస్తా ప్రాంతాలు, పరిసర జిల్లాల్లో వర్షాలు, చెదురుముదురు జల్లులు పడవచ్చు. ఆగ్నేయ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం ఆనుకుని అంటే తూర్పు భూమధ్య రేఖా ప్రాంతం మీదుగా అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదలుతూ..జనవరి 30 నాటికి అల్పపీడనంగా మరింత బలపడనుంది. ఫిబ్రవరి 1వ తేదీకు శ్రీలంకలో తీరం దాటవచ్చు.
అల్పపీడన ప్రభావంతో..ఉత్తర కోస్తాంధ్రలో రానున్న మూడ్రోజులు పొడి వాతావరణం ఉంటుంది. ఇక దక్షిణ కోస్తాంధ్రలో ఆదివారం తేలికపాటి వర్షాలు పడవచ్చు. సోమ, మంగళ వారాల్లో సైతం తేలికపాటి వర్షాలు పడనున్నాయి. రాయలసీమ ప్రాంతంలో ఆదివారం వాతావరణం పొడిగా ఉండగా..సోమ, మంగళవారాల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook