Elephants Gang: శీతాకాలం ముగియనే లేదు కానీ ఎండలు మండుతున్నాయి. ఫిబ్రవరి నెల రెండో వారానికే ఉష్ణోగ్రత్తలు భారీగా నమోదవుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలతోపాటు జీవులు కూడా తాళలేకపోతున్నాయి. ముఖ్యంగా తాగునీరు కోసం అల్లాడుతున్నాయి. నీరు లభించక అటవీ ప్రాంత జీవులు జనారణ్యంలోకి వస్తున్నాయి. తాజాగా తిరుమలలో ఏనుగుల గుంపు అలాగే బయటకు వచ్చాయి. దట్టమైన శేషాచలం అడవుల్లో ఉండే ఏనుగులు దాహం కోసం బయటకు వచ్చాయి. దీంతో తిరుమలలో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది.
Also Read: Minister Muddy: బురదలో ఇరుక్కుని మంత్రి తంటాలు.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు
తిరుమలలో ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపు బయటకు వచ్చింది. తిరుమలలోని పార్వేట మండపం వద్ద పెద్ద సంఖ్యలో ఏనుగుల సమూహం దూసుకురావడంతో కలకలం రేగింది. పాపనాశం వెళ్లే మార్గంలోని పార్వేటి మండపానికి సమీపంలో ఏనుగుల గుంపు స్వైర విహారం చేశాయి. శేషాచలం అటవీ ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాటుచేసిన శ్రీ గంధం వనం వరకు ఏనుగుల గుంపు చేరింది. ఘీంకారిస్తూ ఏనుగులు వడివడిగా వచ్చాయి. అక్కడ శ్రీ గంధం వనం వద్ద ఏర్పాటుచేసిన భారీ కంచెలను ధ్వంసం చేశాయి.
Also Read: Miscarriage: గర్భం కోల్పోయిన భార్య.. కన్నీటిసంద్రంలో మునిగిన స్టార్ క్రికెటర్
ఇదంతా తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జరిగిందని సమాచారం. ఏనుగుల గుంపు దాడి చేస్తున్నాయని సమాచారం అందుకున్న టీటీడీ, అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏనుగుల దాడిని పరిశీలించారు. ఏనుగుల గుంపుని అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు అటవీ శాఖ అధికారుల చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఏనుగుల గుంపు కొన్ని గంటల అనంతరం అటవీ ప్రాంతంలోకి వెళ్లాయి. అయితే ఏనుగుల గుంపు ఎందుకు వచ్చాయనేది ప్రశ్నలు మొదలయ్యాయి.
అటవీ శాఖ, టీటీడీ శాఖ అధికారులు ఏనుగుల గుంపు దాడిపై సమాలోచనలు చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో నీటి కొరత ఏర్పడిందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. నీటి కోసం అటవీ ప్రాంతం వదిలి బయటకు వచ్చాయని ప్రాథమికంగా నిర్ధారించారు. వేసవి ప్రారంభం కాకముందే నీటి కోసం వెతుకుతూ ఏనుగుల గుంపు శేషాచలం అటవీ ప్రాంతాన్ని వదిలి బయటకు రావడం చూస్తుంటే భవిష్యత్‌లో మరింత ప్రమాదం పొంచి ఉందని గ్రహించారు. ఇప్పటి నుంచే అటవీ ప్రాంతంలో నీటి సదుపాయం కల్పించేందుకు అటవీ శాఖ, టీటీడీ అధికారులు సిద్ధమయ్యారు. వెంటనే మేల్కోకపోతే భవిష్యత్‌లో ఏనుగులు తిరుమలలో జనారణ్యం వరకు దూసుకొచ్చే ప్రమాదం లేకపోలేదు. ఒక్క తిరుమలలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా అటవీ ప్రాంతాల్లో నీటి సదుపాయం కల్పించే విషయాన్ని ఏనుగులు గుర్తు చేసి వెళ్లాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook