Vijayawada Airport Runway: విజయవాడ ఎయిర్‌పోర్ట్ సరికొత్తగా అభివృద్ధి చెందుతోంది. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ హోదాతో పాటు ఇప్పుడు కొత్తగా అతి పెద్ద రన్‌వే కలిగిన ఎయిర్‌పోర్ట్‌గా ఖ్యాతి గాంచనుంది. కొత్త రన్‌వే ఇవాళ్టి నుంచి అందుబాటులో రానుంది.
ఏపీలో విశాఖపట్నం, విజయవాడ విమానాశ్రయాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు విజయవాడ ఎయిర్‌పోర్ట్(Vijayawada Airport) మరో ఘనత దక్కించుకుంది. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో భారీ విమానాల రాకపోకల కోసం కొత్తగా నిర్మించిన రన్‌వే (New Runway)ఇవాళ్టి నుంచి అందుబాటులో రానుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 2017 జనవరి 12న ట్రాన్సిట్ టెర్మినల్ ప్రారంభిస్తూనే తొలిదశ రన్‌వే విస్తరణ పనుల్ని ప్రారంభించారు. దాదాపు వంద కోట్లతో ప్రస్తతమున్న 2 వేల 286 మీటర్ల రన్‌వేను ..45 మీటర్ల వెడల్పు, 1 వేయి 74 పొడవుకు విస్తరించారు. ఫలితంగా రన్‌వే మొత్తం పొడవు 3 వేల 360 మీటర్లకు చేరుకుంది. రన్‌వే విస్తరణ ద్వారా రాష్ట్రంలో అతిపెద్ద రన్‌వే (Largest Runway in Ap) కలిగిన విమానాశ్రయంగా విజయవాడ ఎయిర్‌పోర్ట్ గుర్తింపు పొందింది. 3 వేల 165 మీటర్లతో రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ రెండవ స్థానంలోనూ..3 వేల 48 మీటర్ల పొడవుతో విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ మూడవ స్థానంలో ఉన్నాయి.
రన్‌వే విస్తరణ(Runway Extension) పూర్తవడంతో ఇక బోయింగ్ బి 747, బి 787, ఎయిర్ బస్ ఎ 330, ఎ 340, ఎ 350 వంటి భారీ విమానాల రాకపోకలకు వీలవుతుంది. రన్‌వే విస్తరణతో పాటు ఐసోలేషన్ బే, ట్యాక్సీ వే, లింక్ ట్యాక్సీ ట్రాక్, రెండు వైపుల రన్‌వే ఎండ్ సేఫ్టీ ఏరియా, లైటింగ్, బౌండరీ వాల్ పనులు కూడా పూర్తయ్యాయి. రెండేళ్ల క్రితమే రన్‌వే విస్తరణ పూర్తయినా..సాంకేతిక, భద్రతా కారణాల దృష్ట్యా డీజీసీఏ (DGCA) అనుమతిలో ఆలస్యమైంది. ఇప్పుడు ఆ అనుమతి కాస్తా ఇవాళ్టి నుంచి అంటే జూలై 15 నుంచి అందుబాటులో రానుంది.
Also read: EWS Reservations: ఏపీలో ఇక నుంచి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు, వైఎస్ జగన్ కీలక నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook