వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు తన సహచర నటి, టి.కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి బాసటగా నిలిచారు. ఆమెకు మంత్రి పదవి దక్కకపోవడంపై సానుభూతి వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ తన మంత్రివర్గంలోకి రోజాను కూడా తీసుకుని ఉంటే బాగుండేదని విజయశాంతి అభిప్రాయపడ్డారు.
నటులు ప్రచారానికే పరిమితమా ?
సినీ రంగం నుంచి రాజకీయాలలోకి వచ్చిన వారిని కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా వారి సేవలు వినియోగించుకోవాలని విజయశాంతి సూచించారు. సహచర నటి అయిన రోజాకు తగిన గుర్తింపు ఇస్తే బాగుంటుందని తాను చెప్పదలుచుకున్నానని విజయశాంతి పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
చర్చనీయంశంగా మారిన రోజా వ్యవహారం
వైసీపీలో నెంబర్ టూ స్థాయిలో కనిపించిన రోజాకు జగన్ మంత్రివర్గంలో చోటు దక్కని విషయం తెలిసిందే. సామాజిక సమీకరణల వల్ల ఇది సాధ్యపడలేదని పార్టీ వర్గాలు చెబుతున్నారు. తాజా పరిణామాంపై రోజా కామ్ గా ఉన్నప్పటికీ ఆమె అభిమానులు మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తొలి నుంచి జగన్ కు అన్ని విధాలుగా అండగా రోజాకు మంత్రివర్గంలో చోటు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రోజాకు మంత్రి పదవి దక్కకపోవడంపై రాజకీయ వర్గాలు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో టి.కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి తన అభిప్రాయన్ని వ్యక్తం చేశారు.
సినీ రంగానికి చెందిన ఎమ్మెల్యే రోజా కూడా జగన్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. సినీ రంగం నుంచి రాజకీయాలలోకి వచ్చిన వారిని కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా వారి సేవలు వినియోగించుకుని,
— VijayashanthiOfficial (@vijayashanthi_m) June 11, 2019