న్యూఢిల్లీ: వీఐపీల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హై రిస్క్ వీఐపీలకు కల్పిస్తున్న బ్లాక్ క్యాట్ (ఎన్‌ఎస్‌జీ) భద్రతను ఉపసహరించాలని నిర్ణయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా దేశ వ్యాప్తంగా ఈ భద్రతను 13మందికి ఉపసంహరించనున్నారు. ఇకనుంచీ ఈ వీఐసీల భద్రతను పారా మిలిటరీ దళాలూ చూస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. నరేంద్ర మోదీ రెండోసారి అధికారం చేపట్టాక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ కుటుంబం సహా దేశ వ్యాప్తంగా కొందరు వీఐపీలకు భద్రతను తగ్గించిన విషయ తెలిసిందే.
Also read: మరో 10, 15 ఏళ్లు బతుకుతానేమో: చంద్రబాబు
అద్వానీ, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రకాశ్ సింగ్ బాదల్, అసోం సీఎం శర్వానంద సోనోవాల్, మాజీ సీఎంలు మాయావతి, ఫరూక్ అబ్దుల్లా, ములాయం సింగ్ యాదవ్ లకు ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ ఉంది. వీరికి ఒక్కొక్కరికి 25మంది బ్లాక్ క్యాట్ కమాండోలు రక్షణ కల్పిస్తుండగా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ 13 మంది భద్రతను పారా మిలిటరీకి అప్పగించింది. దీంతో దాదాపు 400 మంది NSG కమాండోలు కేంద్రానికి అందుబాటులోకి రానున్నారు.
ఇకపై కౌంటర్ టెర్రరిస్ట్, యాంటీ హైజాక్ వంటి ప్రధాన విధులకు ఈ కమాండోలను నియమించనున్నట్లు కేంద్ర హోంశాఖ వర్గాల సమాచారం. వాస్తవానికి ఎన్‌ఎస్‌జీని యాంటీ టెర్రరిస్ట్, యాంటీ హైజాక్ ఆపరేషన్ల నిమిత్తం 1984లో ఏర్పాటు చేశారు. అనంతరం ఈ కమాండోలను వీఐపీల భద్రత కోసం కేటాయించారు. వీఐపీలకు భద్రత అవసరమే, కానీ అందుకోసం దేశంలోనే అత్యంత కీలకమైన ఎన్ఎస్‌జీ కమాండోలు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కన్నా కొంతమంది ప్రముఖులకు సేవలు అందించాల్సి వస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..