AP: పొంచి ఉన్న మరో రెండు తుపాన్లు

Cyclone Alert: నివర్ సైక్లోన్ ప్రభావం నుంచి తేరుకోకముందే మరో రెండు తుపాన్లు పొంచి ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. డిసెంబర్ నెలలో పొంచి ఉన్న రెండు  తుపాన్లు..దక్షిణ తమిళనాడు, ఏపీలపై ప్రభావం చూపనుంది. 

Last Updated : Nov 27, 2020, 09:14 PM IST
  • నివర్ సైక్లోన్ ప్రభావం నుంచి తేరుకోకముందే మరో రెండు తుపాన్ల హెచ్చరిక
  • డిసెంబర్ 2 నాటికి బంగాళాఖాతంలో బురేవి సైక్లోన్
  • డిసెంబర్ 5-7 నాటికి టకేటి సైక్లోన్
AP:  పొంచి ఉన్న మరో రెండు తుపాన్లు

Cyclone Alert: నివర్ సైక్లోన్ ప్రభావం నుంచి తేరుకోకముందే మరో రెండు తుపాన్లు పొంచి ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. డిసెంబర్ నెలలో పొంచి ఉన్న రెండు  తుపాన్లు..దక్షిణ తమిళనాడు, ఏపీలపై ప్రభావం చూపనుంది. 

తమిళనాడు కరైకల్ సమీపంలో తీరం దాటిన నివర్ సైక్లోన్ ( Nivar Cyclone ) ప్రభావం నుంచి తమిళనాడు, ఏపీ రాష్ట్రాలింకా తేరుకోలేదు. తుపాను పూర్తిగా బలహీనపడకముందే మరో రెండు తుపాన్లు ( Two more cyclones ) పొంచి ఉన్నాయనే వాతావరణ శాఖ హెచ్చరిక ఆందోళన కల్గిస్తోంది. ఈ రెండు తుపాన్లు బంగాళాఖాతంలో ఏర్పడనున్నాయని ఐఎండీ ( IMD ) అప్రమత్తం చేస్తోంది. ఈ నెల 29న బంగాళాఖాతంలో ( Bay of Bengal )  అల్పపీడనం ఏర్పడనుంది. ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి..తరువాత తుపానుగా మారనుందని ఐఎండీ సూచిస్తోంది. ఈ తుపానుకు బురేవి ( Burevi cyclone ) అని పేరు పెట్టనున్నారు. డిసెంబర్ 2 నాటికి తుపానుగా మారనుంది. ఈ తుపాను ప్రభావం ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా, రాయలసీమపై ఎక్కువగా ఉండనుందని తెలుస్తోంది. 

మరోవైపు డిసెంబర్ 5న బంగాళాఖాతంలోనే మరో అల్పపీడనం ఏర్పడనుందని..ఇది డిసెంబర్ 5 నాటికి టకేటి తుపాను ( Taketi cyclone ) గా మారనుందని వాతావరణ శాఖ చెబుతోంది. టకేటి తుపాను ప్రభావం డిసెంబర్ 7వ తేదీన దక్షిణ తమిళనాడు, ఏపీలపై తీవ్రంగా ఉండనుంది. Also read: Prakash Raj Comments on Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!

Trending News