YV Subba Reddy: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కరోనా పాజిటివ్

కోవిడ్19 టెస్టులు చేయించగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కరోనా పాజిటివ్ (YV Subba Reddy Tests Positive for CoronaVirus)గా నిర్ధారించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి వైవీ సుబ్బారెడ్డి చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

Last Updated : Oct 15, 2020, 06:28 PM IST
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది
  • తాజాగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కరోనా వైరస్ బారిన పడ్డారు
  • ఇటీవల తన తల్లి జన్మదిన వేడుకలలో పాల్గొన్న టీటీడీ చైర్మన్
  • టీటీడీ సభ్యుల సమావేశంలో పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి
YV Subba Reddy: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు, కీలక పదవులు చేపట్టిన వారు పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా బారిన పడుతున్న వారి జాబితా పెరుగుతూనే ఉంది. తాజాగా ఈ జాబితాలోకి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subba Reddy) చేరారు. తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలలో వైవీ సుబ్బారెడ్డికి కరోనా పాజిటివ్‌ (YV Subba Reddy Tests Positive for CoronaVirus)గా తేలింది.

చికిత్స నిమిత్తం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన టీటీడీ సమావేశం (TTD Meeting)లో ఆయన పాల్గొన్నారు. అక్టోబర్ 12న సైతం తన తల్లి వై.పిచ్చమ్మ జన్మదినం సందర్భంగా వేడుకలు నిర్వహించగా.. అందులో పాల్గొని ఆమె నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ క్రమంలో వైవీ సుబ్బారెడ్డికి కరోనా లక్షణాలు కనిపించాయి. ఎందుకైనా మంచిదని కోవిడ్19 టెస్టులు చేయించుకోగా, తాజా ఫలితాలలో వైవీ సుబ్బారెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. 

 

కాగా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కరోనా పాజిటివ్ రావడంతో బోర్డు సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు, తల్లి జన్మదిన వేడుకల్లోనూ పాల్గొనడంతో అక్కడ సైతం వైవీ సుబ్బారెడ్డిని కలిసిన వారు ఆందోళన చెందుతున్నారు. కుటుంబం మొత్తం కరోనా పరీక్షలు చేయించుకుందా.. లేక శాంపిల్స్ ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది. తనను ఇటీవల కలిసిన వారు హోం క్వారంటైన్‌కు వెళ్లాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News