TTD Arjitha Seva: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త. ఆర్జిత సేవలకోసం నేటి నుంచి టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఈ నెల 22వ తేదీ వరకు ఆర్జిత సేవలకోసం టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునే వీలుందని వెల్లడించింది.
కరోనా కారణంగా దాదాపు రెండేళ్లపాటు నిలిపివేసిన ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించాలని ఇటీవలే టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 1 నుంచి ఆర్జిత సేవలు అందుబాటులో ఉంటాయని వివరించింది. నేటి నుంచి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు.. ఏప్రిల్, మే, జున్ నెలలకు సంబంధించి టికెట్లు బుక్ చేసుకోవచ్చని పేర్కొంది టీటీడీ.
టికెట్లు బుక్ చేసుకోవడం ఎలా?
టీటీడీ అధికారిక వెబ్సైట్ tirupatibalaji.ap.gov.in ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్లు బుకింగ్స్ వివరాలను ఈ నెల 22 తర్వాత.. సంబంధిత భక్తులకు ఎస్ఎంఎస్ లేదా ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు. కొవిడ్ నిబంధనల కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులకు మాత్రమే టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం ఎలక్ట్రానికి డిప్ ద్వారా ఎంపిక ఎంపిక చేస్తారు.
ఈ నిబంధనలు తప్పనిసరి..
దేశవ్యాప్తంగా ప్రస్తుతం కొవిడ్ కేసులు తగ్గుతున్నప్పటికీ.. కరోనా నిబంధననల్లో మాత్రం సడలింపు లేదని టీటీడీ స్పష్టం చేసింది. తిరుమలకు వచ్చే భక్తులకు నెగెటివ్ రిపోర్ట్ లేదా రెండు డోసులు టీకా తీసుకున్నట్లు సర్టిఫికెట్ చూయించడం తప్పనిసరి అని టీటీడీ వివరించింది. ఇక భక్తులంతా భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటివి తప్పనిసరి అని వెల్లడించింది.
Also read: AP Inter Revised Schedule: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలకు కొత్త షెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వం
Also read: Pegasus Spyware: చిక్కుల్లో చంద్రబాబు.. మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు.. పెగాసస్ కొనుగోలు చేశారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook