Supreme court serious on Tirumala laddu controversy: తిరుమల లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు, చేపల నూనెలు కలిపారనే ఘటన ప్రస్తుతం దేశంలో పెనుదుమారంగా మారింది. ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై ప్రకటన చేయడం దీనిపై కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో దీనిపై దేశ వ్యాప్తంగా రచ్చ నెలకొంది. ఏపీ సర్కారు సిట్ ను సైతం ఏర్పాటు చేసింది. మరోవైపు.. దీనిపై ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది.
మరోవైపు.. దీనిపైన బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై ఈరోజు (సోమవారం) జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో అత్యున్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
తిరుమల లడ్డుతయారీలో కల్లీ నెయ్యి వ్యవహారంలో.. సీఎం చంద్రబాబు, టీటీడీ భిన్నమైన ప్రకటనలపై స్పష్టత నివ్వాలని కూడా అత్యున్నత ధర్మాసనం కోరింది. మెయిన్ గా సెప్టెంబరు 18 సీఎం చంద్రబాబు ప్రకటన, 20 న టీటీడీ ఈవో ప్రకటనలపై వ్యాఖ్యలు చేసింది. గతంలో.. ఇదే కాంట్రాక్టర్ నాలుగు ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేశారని, కల్లీ నెయ్యి వినియోగం జరిగిందని భావిస్తున్నామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకి తెలిపారు.
కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించారా..? అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది.. లడ్గు నాణ్యత లేదని భక్తులు ఫిర్యాదు చేశారని.. ప్రభుత్వ న్యాయవాది లూథ్రా వెల్లడించారు. ఈ క్రమంలోనే లడ్డులను ల్యాబ్ టెస్టింగ్ కోసం పంపించారా..?..ఖచ్చితంగా జంతువుల అవశేషాలు లడ్డులో కలిసినట్లు ఎలా చెప్పగలరని కూడా ఏపీ సర్కారుపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. మరోవైపు విచారణ పూర్తికాకముందే కల్తీపై ప్రకటనలు చేయడం ఎంతవరకు సబబు అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. భక్తుల మనో భావాలు దెబ్బతిసేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదంటూ కూడా ధర్మాసనం సూచించింది.
దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచుతారని కోరుకుంటున్నట్లు కూడా ధర్మాసనం తెలిపింది. అదే విధంగా జులైలో నివేదిక వస్తే.. చంద్రబాబు సెప్టెంబర్‌లో మీడియా ముందుకు ఎందుకు వెల్లడించారన్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిందని ప్రభుత్వ తరపు లాయర్ వాదించారు. అయితే.. సిట్ ఫైనల్ దర్యాప్తు ఫలితాలు వెలువడకముందే.. బహిరంగ ప్రకటన చేయాల్సిన అవసరమేముందని కూడా సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వంపైన ఘాటుగా స్పందించి తదుపరి విచారణకు గురువాారానికి వాయిదా వేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.