Timesnow ETG Survey: ఈసారి ఏపీలో అధికారం ఎవరిది, తేల్చేసిన టైమ్స్ నౌ-ఈటీజీ తాజా సర్వే

Timesnow ETG Survey: దేశంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్నాయి. మరో 3-4 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈక్రమంలో వివిధ సంస్థలు ఒపీనియన్ పోల్ నిర్వహిస్తున్నాయి. ఈసారి అధికారం ఎవరిదనేది తేలుస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 9, 2024, 07:45 AM IST
Timesnow ETG Survey: ఈసారి ఏపీలో అధికారం ఎవరిది, తేల్చేసిన టైమ్స్ నౌ-ఈటీజీ తాజా సర్వే

Timesnow ETG Survey: రానున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో  ప్రజల నాడి ఎలా ఉండనుందనే విషయంపై ఇప్పటికే దాదాపు అన్ని జాతీయ సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. అదే విధంగా ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ నౌ ఈటీజీ మరో సర్వే నిర్వహించింది. ఈసారి అధికారం ఎవరిదనేది తేల్చిచెప్పింది. ఏపీ,తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రల్లో ఈ సర్వే నిర్వహించింది. 

టైమ్స్ నౌ ఈటీజీ సంస్థ ఏపీలో డిసెంబర్ 13 నుంచి మార్చ్ 7 వరకూ సర్వే చేపట్టింది. ఈ సర్వే ద్వారా మొత్తం 3 లక్షల 20 వేలమంది అభిప్రాయాన్ని సేకరించగా ఇందులో క్షేత్రస్థాయి అభిప్రాయ సేకరణ 85 శాతం కాగా, ఫోన్ల ద్వారా 15 శాతం జరిగింది. ఈ సర్వే ద్వారా అధికార పార్టీలకే మరోసారి అత్యధిక స్థానాలు వస్తాయని తేలింది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక లోక్‌సభ స్థానాలు గెల్చుకుంటుందని టైమ్స్ నౌ సర్వే తెలిపింది. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకు 8-10, బీజేపీకు 4-6, సీట్లు. బీఆర్ఎస్ పార్టీకు 2-4 సీట్లు రావచ్చని అంచనా వేసింది. 

ఇక ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తుందని వెల్లడించింది. మొత్తం 2 లోక్‌సభ స్థానాల్లో వైసీపీ 21-22 స్థానాలు చేజిక్కించుకోవచ్చని తెలిపింది. తెలుగుదేశం-జనసేన కూటమి 3-4 లోక్‌సభ స్థానాలకే పరిమితం కావచ్చు. ఇక ఓటింగ్ శాతమైతే వైసీపీకు 49 శాతం, టీడీపీ-జనసేన కూటమికి 45 శాతం, ఎన్డీఏ కూటమికి 2 శాతం ఉండవచ్చు. ఇతరులకు మరో 4 శాతం ఓటింగ్ ఉంటుందని వెల్లడించింది. 

దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాల్లో కూడా టైమ్స్ నౌ ఈటీజీ సర్వే నిర్వహించింది. కేరళలో ఎన్డీయే కూటమి 0-1 స్థానం, ఇండియా కూటమి 18-20 స్థానాలు దక్కించుకోనుంది. కర్ణాటకలో బీజేపీ 21-23 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 4-6 స్థాలు, జేడీఎస్ 1-2 స్థానాలు దక్కించుకోవచ్చు. ఇక తమిళనాడులో ఎన్డీయే కూటమి 2-6 స్థానాలు, ఇండియా కూటమి 29-35, అన్నాడీఎంకే 1-3 స్థానాల్లో విజయం సాధించవచ్చు. ఇక మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి 34-38 స్థానాలు, ఇండియా కూటమి 9-13 స్థానాలు దక్కించుకోవచ్చు. 

Also read: Ranga Murder: కాపులు 'సైకిల్‌'కు ఓటేయొద్దు.. రంగా హత్యపై పోసాని కృష్ణమురళీ సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News