Times Now-ETG Survey: దక్షిణాది రాష్ట్రాల్లో ఏ పార్టీకు ఎన్ని సీట్లు, ఏపీలో ఈసారి అధికారం ఎవరిది

Times Now-ETG Survey: ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఎన్నికలు సమీపించేకొద్దీ వివిధ జాతీయ మీడియా సంస్థల సర్వేలు హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా మరో సంస్థ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉందనేది సర్వే చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 5, 2024, 06:09 AM IST
Times Now-ETG Survey: దక్షిణాది రాష్ట్రాల్లో ఏ పార్టీకు ఎన్ని సీట్లు, ఏపీలో ఈసారి అధికారం ఎవరిది

Times Now-ETG Survey: దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా ఏప్రిల్ 19 నుంచి తొలి విడత ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈలోగా వివిద జాతీయ మీడియా సంస్థలు ఒపీనియన్ పోల్స్ నిర్వహిస్తున్నాయి. ఏ పార్టీకు ఎక్కడ ఎన్ని సీట్లు వస్తాయో అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ- ఈటీజీ చేసిన సర్వే ఆసక్తి రేపుతోంది. 

దాదాపు నెలరోజుల వ్యవధిలో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా ఫోకస్ చేసి సర్వే నిర్వహించింది టైమ్స్ నౌ జాతీయ సంస్థ. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాల్లో అధికార పార్టీని కాదని బీజేపీ 21-23 సీట్లు గెల్చుకోవచ్చని, కాంగ్రెస్ పార్టీ కేవలం 4-6 స్థానాలకు పరిమితం కావచ్చని తెలుస్తోంది. ఇక జేడీఎస్ 1-2 లోక్‌సభ స్థానాలు గెల్చుకోవచ్చని టైమ్స్ నౌ ఈటీజీ అభిప్రాయపడింది. 

ఇక 39 లోక్‌సభ స్థానాలున్న తమిళనాడులో అధికార డీఎంకే 21-22 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 5-7 సీట్లు గెల్చుకోవచ్చని టౌమ్స్ నౌ-ఈటీజీ సర్వేలో వెల్లడైంది. గత ఎన్నికల్లో ఖాతా తెరవని బీజేపీ ఈసారి 2-6 స్థానాలు సాధించవచ్చు. ఏఐఏడీఎంకేకు 1-3 స్థానాలు లభించనున్నాయి. ఇతరులు మరో 4-5 స్థానాలు గెలవవచ్చు. ఇక కేరళలో కాంగ్రెస్ పార్టీ 8-10 స్థానాలు, సీపీఎం 6-8 సీట్లు, ఐయూఎంఎల్ 1-2 స్థానాలు గెలిచే పరిస్థితులున్నాయని అంచనా వేసింది. ఇతరులు మరో 1-2 స్థానాలు సాధించవచ్చు. 

ఇక తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ 8-10 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయి. బీజేపీ 4-6 లోక్‌సభ స్థానాల్లోనూ, బీఆర్ఎస్ పార్టీ 1-3 స్థానాల్లోనూ విజయం సాధించవచ్చు. ఇక ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 21-22 లోక్‌సభ సీట్లు గెలిచే అవకాశాలున్నాయి. తెలుగుదేశం-బీజేపీ-జనసేన కూటమికి 3-4 స్థానాలు దక్కవచ్చు. అంటే ఏపీలో మరోసారి అధికారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని టైమ్స్ నౌ - ఈటీజీ సర్వే తెల్చిచెప్పింది. 

Also read: Anaparthi Seat: అనపర్తి అసమ్మతిపై చంద్రబాబు దిగొచ్చినట్టేనా, సీటు మార్చే ఆలోచన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News