AP: మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

ఏపీలో మరో ఎమ్మెల్యే ప్రాణాంతక కరోనా మహమ్మారి బారిన పడ్డారు. గతంలో రెండుసార్లు పరీక్షలు చేపించుకుంటే నెగటివ్ వచ్చిందని, ప్రస్తుతం జలుబు రావడంతో మరోసారి టెస్టులు చేపించగా ఫలితాలలో కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు ఎమ్మెల్యే శివకుమార్ (Annabathuni Siva Kumar Tests Positive For CoronaVirus). 

Last Updated : Jul 19, 2020, 05:15 PM IST
AP: మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

తెనాలి: ఏపీలో మరో ఎమ్మెల్యే ప్రాణాంతక కరోనా మహమ్మారి బారిన పడ్డారు. గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ (Annabathuni Siva Kumar)కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. నిన్న శాంపిల్స్ ఇవ్వగా నేడు వచ్చిన కోవిడ్19 ఫలితాలలో తనకు పాజిటివ్‌గా తేలినట్లు వైఎస్సార్‌సీపీ(YSRCP) ఎమ్మెల్యే శివకుమార్ తెలిపారు. Rajasthan: కాంగ్రెస్ ఎమ్మెల్యేల అంత్యాక్షరి.. వీడియో వైరల్ 

తనకు కరోనా సోకిన విషయాన్ని తెలుపుతూ ఎమ్మెల్యే శివకుమార్ (MLA Siva Kumar Covid19 Positive) ఓ వీడియోలో సందేశానిచ్చారు. గతంలో రెండుసార్లు పరీక్షలు చేపించుకుంటే నెగటివ్ వచ్చిందని, ప్రస్తుతం జలుబు రావడంతో మరోసారి టెస్టులు చేపించగా ఫలితాలలో కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నాని, ఏ ఆందోళన అక్కర్లేదని చెప్పారు.  మోడల్ Shweta Mehta Hot Photos వైరల్     

కరోనా విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని నియోజకవర్గ ప్రజలకు సూచించారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని.. ప్రజలకు నిత్యం ఫోన్లో అందుబాటులో ఉండి పనులు పర్యవేక్షిస్తానని చెప్పారు. కచ్చితంగా అవసరం ఉంటే తప్పా ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దని కోరారు.   వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    

 

Trending News