Ram Goapl Varma Vyuham: ఆర్జీవీ వ్యూహం సినిమాకు నా పాటలు ఇస్తా.. టీడీపీ నేత ఆఫర్

TDP Leader Panthagani Narasimha on RGV Vyuham Movie: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీయబోయే వ్యూహం సినిమా ఏపీలో రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. ఎవరిని టార్గెట్‌గా చేసుకుని ఆయన సినిమా తీస్తారేనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 31, 2022, 11:16 AM IST
Ram Goapl Varma Vyuham: ఆర్జీవీ వ్యూహం సినిమాకు నా పాటలు ఇస్తా.. టీడీపీ నేత ఆఫర్

TDP Leader Panthagani Narasimha on RGV Vyuham Movie: ఇటీవల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన తరువాత కాంట్రవర్సీ కింగ్, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వ్యూహం, శపథం సినిమాలు తీస్తానంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలపై ఏపీలో రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఇటీవల జగన్ మోహన్ రెడ్డి-పవన్ కళ్యాణ్‌ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆర్జీవీ తీయబోయే సినిమాలపై అందరికీ ఆసక్తి నెలకొంది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాలో ఎవరి గురించి తీస్తాడో చూడాలి.

ఇక ఆర్జీవీకి ఓ టీడీపీ నేత ఆఫర్ ఇచ్చాడు. ఆయన తీయబోయే సినిమాల్లో తన పాటల రైట్స్ ఇస్తానని తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు నరసింహప్రసాద్ తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వర్మ.. బయట ఎవరికి ఏమి చెప్పట్లేదన్నారు. ఈ సినిమాల్లో నిజాలు ఉంటాయని ఆర్జీవీ అన్నారని.. అంటే గతంలో ఆయన సినిమాలు కల్పితాలేనా..? అని ప్రశ్నించారు. జనాల్లో తన పాటలకు మంచి ఆదరణ ఉందని.. ఆర్జీవీ సినిమాల్లో ఉపయోగించుకోవాలని కోరారు. వర్మ అడిగితే తన పాటల రైట్స్ ఇస్తానని చెప్పారు. 

మొదటి పార్ట్ వ్యూహం, రెండవ పార్ట్ శపథంగా ఆర్జీవీ రెండు సినిమాలు తీయనున్నారు. ఈ రెండింటిలోనూ రాజకీయ అంశాలే కచ్చితంగా ఉంటాయి. రాష్ట్ర ప్రజలు ఫస్ట్ మూవీ వ్యూహం షాక్ నుంచి తేరుకునేలోపే వాళ్లకు ఇంకో ఎలక్ట్రిక్ షాక్ శపథం రూపంలో తగులుతుందన్నారు. గతంలో తాను తీసిన వంగవీటి సినిమా నిర్మాతనే.. ఈ చిత్రాలను నిర్మిస్తారని చెప్పారు. ఇది బయోపిక్ కాదని.. రియల్ పిక్ అంటూ మరింత ఆసక్తిని క్రియేట్ చేశాడు. 

ఆర్జీవీ తీస్తున్న పొలిటికల్ సినిమాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నా.. జనాలకు చేరువ చేయడంలో ఆర్జీవీ సక్సెస్ అయ్యాడు. 2019లో ఎన్నికలకు ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో తీసిన సినిమా వివాస్పదమైన విషయం తెలిసిందే. అప్పట్లో వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆర్జీవీ ప్రయత్నించారని ప్రచారం జరిగింది. మళ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో వర్మ మరోసారి టీడీపీ, జనసేన పార్టీలను టార్గెట్ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.  

Also Read: T20 World Cup: డేంజర్‌ జోన్‌లో టీమిండియా.. మారిపోయిన సెమీస్ లెక్కలు

Also Read: Hyderabad Metro Charges: మెట్రో రైలు ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్.. పెరగనున్న ఛార్జీలు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News