గవర్నర్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ సందడి

గవర్నర్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో కేసీఆర్, జగన్ సందడి

Last Updated : Jun 1, 2019, 11:27 PM IST
గవర్నర్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ సందడి

హైదరాబాద్‌: రంజాన్ మాసం సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి హాజరయ్యారు. రాజ్‌భవన్‌లోని సాంస్కృతిక మందిరంలో జరిగిన ఇఫ్తార్‌ విందులో ఇద్దరు ముఖ్యమంత్రులతోపాటు రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా ఇఫ్తార్ విందుకు హాజరైన వారిని ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ మాట్లాడుతు ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

 

Trending News