ఢిల్లీ: పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద ప్రత్యేక హోదా నినాదాలు వినిపించాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని..విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ టీడీపీ,వైసీపీ ఎంపీలు మరోమారు ఆందోళన చెపట్టారు. సేవ్ ఏపీ- సేవ్ నేషన్ నినాదాలతో కూడిన ప్లకార్లులు టీడీపీ ప్రదర్శించగా.. ప్రత్యేక హోదా ప్లకార్లులను వైసీపీ ఎంపీలు ప్రదర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు అమలు చేయాలని ఎంపీలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ విషయంలో మోడీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై మరో టీడీపీ, వైసీపీ ఎంపీలు ధ్వజమెస్తారు.
సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన ఎంపీ శివప్రసాద్
ఈ సందర్భంగా శివుడి వేషంలో వచ్చిన ఎంపీ శివప్రసాద్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నిన్న ఉదయం రావణాసుడి వేషంలో ఆయన నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఎంపీ శివప్రసాద్ ఈ సందర్భంగా మోడీ సర్కార్ తీరును తీవ్రంగా దయ్యబట్టారు. విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని ఆరోపించారు. తెలుగుజాతిపై కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత వైఖరికి ఇదే నిదర్శనమని ఎంపీ శివప్రసాద్ ఆరోపించారు.
ఎయిర్ ఫోర్స్ విన్యాసాల రద్దు ప్రస్తావన
ఈ సందర్భంగా విశాఖలో నిర్వహించనున్న ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ ఎంపీలు మోడీ సర్కార్ విమర్శలు సంధించారు. విశాఖలో నిర్వహించతలపెట్టిన ఎయిర్ ఫోర్స్ విన్యాసానాలను ఆకస్మాత్తుగా రద్దు చేయాలన్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. విన్యాసాలకు సంబంధించిన ఏర్పాటు పూర్తి చేసుకొన్న తరుణంలో దీన్ని రద్దు చేయడం దారుణమన్నారు. ఇది విశాఖ వాసులతో పాటు తెలుగు ప్రజలను అవమానించాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఇలా చేసిందని టీడీపీ ఎంపీలు దయ్యబట్టారు.