Chandrababu: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టును సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో ఇవాళ చంద్రబాబు తరపు న్యాయవాది లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. ఏసీపీ కోర్టు తీర్పును సవాలు చేశారు
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబు ఆరోగ్యంపై చేసిన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రతి రోజూ ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేలా అనుమతి మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబును ప్రత్యేక గదిలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచారు.
మరోవైపు చంద్రబాబు రిమాండ్‌ను హౌస్ అరెస్ట్‌గా పరిగణించాలంటూ చంద్రబాబు తరపున పిటీషన్ దాఖలు చేసిన సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ద్ లూథ్రాకు, సీఐడీ తరపున అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డికి మధ్య నిన్నంతా వాదనలు జరిగాయి. ఎన్ఎస్‌జి భద్రతలో ఉన్న చంద్రబాబుకు జైలులో ప్రమాదముందని సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా తెలిపారు. అయితే జైలులో చంద్రబాబుకు పూర్తి భద్రతతో పాటు 24 గంటలు వైద్య బృందం, సీసీ కెమేరా పర్యవేక్షణ ఉందని సీఐడీ వాదించింది. చంద్రబాబు హౌస్ కస్డడీ విషయంలో ఇవాళ ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించనుంది.
మరోవైపు చంద్రబాబు అరెస్టు అక్రమమని, ఏసీబీ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరపున ప్రముఖ న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్ లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ రేపు అంటే బుధవారం విచారణకు రానుంది.
Also read: Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో వర్ష సూచన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Chandrababu: చంద్రబాబు అరెస్టును సవాలు చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్