Babu Class: ఏపీలో టీడీపీ బలోపేతంపై దృష్టి పెట్టిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు..ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ నేతలతో సమావేశమవుతూ పార్టీ విధానాలను వివరిస్తున్నారు. కింది స్థాయి శ్రేణులకు సైతం దిశానిర్దేశం చేస్తున్నారు. 2024 ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతున్నారు. ఇటీవల జిల్లాల పర్యటలను షురూ చేసి చంద్రబాబు..కుప్పంలో విస్తృతంగా పర్యటించారు.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధినేత చంద్రాబు జోరు పెంచారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బాదుడే బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలపై ఎలాంటి భారం పడుతుందో జిల్లాల పర్యటనలో వారికి వివరిస్తున్నారు. ఈక్రమంలోనే కుప్పంలో మూడు రోజులపాటు పర్యటించారు. ప్రజలతో మమేకం అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతంపై చర్చించారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఓటమి గల కారణాలపై ఆరా తీశారు. ఈనెలలో ఒంగోలులో మహానాడు జరుగుతుందని..అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
టీడీపీ నేతల సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటింటికి బాదుడే బాదుడు కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో ఉన్న వారికే పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీలోకి కొత్త రక్తం వచ్చేలా చూడాలన్నారు. ఇదే సమయంలో పార్టీ కోసం పనిచేస్తున్న వారికి సముచిత స్థానం ఉంటుందని నేతలకు చంద్రబాబు క్లాస్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో యువతకు 40 శాతం టికెట్లు ఇస్తామని తేల్చి చెప్పారు. టీడీపీలో సీనియర్లకు పెద్దపీట ఉంటుందని గుర్తు చేశారు. వారి సేవలను బట్టి నామినెటెడ్ పోస్టులు ఇస్తామన్నారు.
ప్రతి 50 ఇళ్లకు ప్రభుత్వం వాలంటీర్లను నియమించిందని..అదే విధంగా ప్రతి వంద ఓట్లకు ఓ సెక్షన్ ఇన్‌ఛార్జ్ నియమించాలని ఆదేశించారు. వచ్చే ఎన్నికల్లో వీరే కీలకం అవుతున్నారని చంద్రబాబు(CHANDRA BABU) చెప్పారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు చాలా మంది ఉన్నారని..దానిని అందిపుచ్చుకోవాలన్నారు. ప్రజల్లో ఉంటూ పార్టీ కోసం పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాటు సరి చేసుకోవాలన్నారు.
Also read:TSRTC City Bus: ఆర్టీసీ గుడ్ న్యూస్... హైదరాబాద్‌లో ఇక అర్ధరాత్రి తర్వాత కూడా సిటీ బస్సులు...
Also read:SRH VS KKR: హైదరాబాద్ జట్టుకు విజయం వరించేనా..? నేడు కీలక పోరు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook