అవిశ్వాసానికి మద్దతివ్వాలని లాలూను కోరిన టీడీపీ ఎంపీలు

                              

Last Updated : Jul 17, 2018, 01:54 PM IST
అవిశ్వాసానికి మద్దతివ్వాలని లాలూను కోరిన టీడీపీ ఎంపీలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమైన టీడీపీ..అందుకు అవసరమైన మద్దతు కూడా గట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ విషయంలో టీఆర్ఎస్, డీఎంకే పార్టీలతో సంప్రదించిన టీడీపీ ఎంపీలు ఇప్పుడు తాజాగా ఆర్జేడీ మద్దతు కూడగట్టేందుకు లాలూ ప్రసాద్ యాదవ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో తమ పోరాటానికి మద్దతు తెలపాలని లాలును కోరారు. టీడీపీ ఎంపీల విన్నపానికి సానుకూలంగా స్పందించిన లాలూ .. టీడీపీ పోరాటానికి మద్దతిస్తామని తెలిపారు.  కాగా లాలూను కలిసిన వారిలో ఎంపీలు గరికపాటి, గల్లా జయదేవ్‌, రవీంద్రకుమార్‌ ఉన్నారు  

విభజన హామీలు అమలు విషయంలో కేంద్రం మోసం చేసిందని వాదిస్తున్న టీడీపీ.. మరోమారు మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైంది . ఈ క్రమంలో విపక్ష పార్టీల మద్దతు కూడగట్టేందు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో తెలంగాణలో టీఆర్ఎస్, తమిళనాడులో డీఎంకే పార్టీలతో సంప్రదించింది. ఈ క్రమంలో ఈ రోజు లాలూ ప్రసాద్ యాదవ్ తో భేటీ అయింది. కాగా అవిశ్వాసం తీర్మానంపై మద్దుతు కోసం టీడీపీ ఎంపీలు మమత, కేజ్రీవాల్, ములాయం, మాయవతి, కుమారస్వామి తదితర నేతలతో భేటీ కావాలని నిర్ణయించినట్లు సమాచారం.

Trending News