మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన ఏసీబీ... హుటాహుటిన విజయవాడకు తరలింపు!

ఈఎస్ఐ స్కామ్ లో ఆరోపణలున్ననేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడిని ఈ తెల్లవారుజామున ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆపై విజయవాడకు తరలించారు.

Last Updated : Jun 12, 2020, 09:24 AM IST
మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన ఏసీబీ... హుటాహుటిన విజయవాడకు తరలింపు!

అమరావతి: ఈఎస్ఐ స్కామ్ లో ఆరోపణలున్ననేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడిని ఈ తెల్లవారుజామున ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆపై విజయవాడకు తరలించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఏపీ కార్మిక మంత్రిగా అచ్చెన్నాయుడు బాధ్యతలను నిర్వహించిన సమయంలో ఈఎస్ఐలో మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, ప్రస్తుత కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం నేతృత్వంలోని విచారణ కమిటీ ఇప్పటికే, ప్రాథమిక, మధ్యంతర నివేదికలను సమర్పించగా, ఔట్ డేటెడ్ మందులు కొన్నారని తేలింది. ఇదే సమయంలో అర్హత లేని కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చారని, దాదాపు రూ. 900 కోట్ల అక్రమాలు జరిగి వుంటాయని అంచనాకు వచ్చారు.

ఈ నేపథ్యంలో దాదాపు 200 మంది ఏసీబీ  అధికారులు 100 మంది పోలీసుల సాయంతో శ్రీకాకుళం జిల్లా టెక్కలి పరిధిలోని నిమ్మాడకు చేరుకుని ఆయన ఇంటిపై సోదాలు నిర్వహించారు. ఇదేక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యేను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించి, విజయవాడకు తరలిస్తున్నట్టు తెలిపారు. సోదాలు చేసే క్రమంలో  ఏ విధమైన అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా, భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.

మరోవైపు అచ్చెన్నాయుడు నిర్లక్ష్యంతోనే రూ. 975 కోట్ల మందులను కొనుగోలు చేశారని, అధికారులు, రూ. 100 కోట్లకు పైగా నకిలీ బిల్లులను సృష్టించారని గతంలోనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మందుల కొనుగోలు నిమిత్తం రూ. 293 కోట్లు కేటాయించగా, రూ. 698 విలువైన మందులను కొని, ఖజానాకు రూ. 405 కోట్ల నష్టం కలిగించారన్న ఆరోపణలపై ఏసీబీ విచారణ ప్రారంభించింది.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News