అమరావతి : టిడిపి మహానాడు 2020 ( TDP Mahanadu 2020 ) ప్రారంభమైంది. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకంటే ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ అధినేత చంద్రబాబు, పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్, చిన రాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అయ్యన్నపాత్రుడు, వర్ల రామయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులు, ఇటీవల చనిపోయిన పార్టీ కార్యకర్తలకు మహానాడు వేదిక ద్వారా తమ సంతాపం తెలియజేశారు. 12 గంటల నుంచి మహానాడుకు హాజరైన పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించడం ప్రారంభించారు. ( TDP Mahanadu 2020 : టీడీపీ మహానాడుకు ''కరోనా'' దెబ్బ )
ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు మహానాడు సదస్సులు జరగనున్నాయని తెలుస్తోంది. కరోనావైరస్ వ్యాప్తి, లాక్ డౌన్, సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో పార్టీ నేతలను, కార్యకర్తలను మహానాడుకు ఆహ్వానించే పరిస్థితి లేకపోయింది. దీంతో ఆన్‌లైన్ ద్వారా జూమ్ యాప్‌లో వర్చువల్ మహానాడు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు దాదాపు 14 వేల మంది మహానాడు కార్యక్రమాన్ని వీక్షించేలా పార్టీ సాంకేతిక బృందం ఏర్పాట్లు చేసింది. ఇందుకు అనుగుణంగా పార్టీ నేతలు, కార్యకర్తలకు తగిన సూచనలు జారీచేసింది. ( ఆ ఎమ్మెల్యే కన్పించడం లేదు : మరో నేతపై మంత్రి అవంతి వ్యంగ్యాస్త్రాలు )
ఏపీ, తెలంగాణలోని తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పార్టీ సూచనల మేరకు ఆన్‌లైన్ ద్వారా టీడీపీ మహానాడు 2020లో పాల్పంచుకోనున్నారు. జూమ్ యాప్ సౌకర్యం అందుబాటులో లేని మిగతా నేతలు, కార్యకర్తలు, అభిమానులు టిడిపి అధికారిక వెబ్‌సైట్, ఫేస్‌బుక్ ద్వారా మహానాడు ప్రత్యక్షప్రసారాన్ని వీక్షించేవిధంగా పార్టీ ఏర్పాట్లు చేసుకుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..