Candidates Change: ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్ని చోట్ల అసెంబ్లీ అభ్యర్థులను మార్చి వేరే వారికి అవకాశం కల్పించింది. నాలుగు చోట్ల అసెంబ్లీ అభ్యర్థులను టీడీపీ మార్చింది. ఎన్నికల సమయం ముంచుకొస్తున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం టీడీపీలో చర్చనీయాంశమైంది. అయితే అనూహ్యంగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు టీడీపీ కోటాలో టికెట్ లభించడం గమనార్హం.
Also Read: JanaSena: పవన్ కల్యాణ్‌కు అనారోగ్యం.. ప్రజలకు జనసేన పార్టీ కీలక సూచనలు
టీడీపీ - జనసేన - బీజేపీ పొత్తులలో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాలకు టికెట్లు ప్రకటించింది. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే. వారంతా నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత టిక్కెట్ దక్కని నాయకులు చాలా చోట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర అసంతృప్తి నాలుగు స్థానాల్లో అభ్యర్థులను పార్టీ అధినేత చంద్రబాబు మార్చివేశారు. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, ఉండి నుంచి రఘురామ కృష్ణం రాజు, మడకశిర నుంచి ఎంఎస్ రాజు, మాడుగుల నుంచి బండారు సత్యన్నారాయణ, వెంకటగిరి నుంచి కురుగొండ్ల రామకృష్ణకు అవకాశం ఇచ్చారు.
Also Read: Tarak Ratna Wife: తారకరత్న భార్య సంచలన ప్రకటన.. ఏపీ ఎన్నికల్లో ఆమె మద్దతు ఎవరికి అంటే?
విజయవాడలో ఆదివారం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 144 అసెంబ్లీ స్థానాలకు, 17 ఎంపీ స్థానాలకు గానూ అభ్యర్ధులకు బీ ఫారం ఇచ్చారు. అయితే అభ్యర్థుల మార్పు కూడా టీడీపీలో దుమారం రేపింది. ఆయా రాజకీయాల్లో పార్టీ నిర్ణయంపై శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మారిన స్థానాలు
- పాడేరు - గిడ్డి ఈశ్వరి
- ఉండి - రఘురామ కృష్ణం రాజు
- మడకశిర - ఎంఎస్ రాజు
- మాడుగుల - బండారు సత్యన్నారాయణ
- వెంకటగిరి - కురుగొండ్ల రామకృష్ణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter