ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్ట్ షాక్..

ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలకు షెడ్యూల్ ప్రక్రియ విడుదల చేయడానికి రెండు రోజులు మాత్రమే ఉన్న తరుణంలో, సుప్రీంకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలకు స్టే విధించడం ద్వారా ప్రభుత్వానికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. 50 శాతానికి మించి

Last Updated : Jan 15, 2020, 03:40 PM IST
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం  కోర్ట్ షాక్..

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలకు షెడ్యూల్ ప్రక్రియ విడుదల చేయడానికి రెండు రోజులు మాత్రమే ఉన్న తరుణంలో, సుప్రీంకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలకు స్టే విధించడం ద్వారా ప్రభుత్వానికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. 50 శాతానికి మించి రిజర్వేషన్ పెంచడం అనేది చట్టానికి విరుద్ధం అని సుప్రీం కోర్టు తెలిపింది. 

స్థానిక సంస్థ ఎన్నికలలో 59.85 శాతం రిజర్వేషన్లను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం GO 176ను విడుదల చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఈ GOను నిలిపివేసింది. ఇదే అంశాన్ని నాలుగు వారాల్లో పరిష్కరించాలని సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించింది. 

ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన రెడ్డి అసోసియేషన్ కు సంబంధించి ఓ వ్యక్తి రిజర్వేషన్ అంశంపై సుప్రీం కోర్టును ఆశ్రయించగా , గతంలో రిజర్వేషన్ల కు సంబంధించిన తీర్పులపై, తదితర అంశాలపై సుప్రీం కోర్టుకు తన పిటిషన్లో పొందుపర్చాడు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News