Supreme court on local elections: పంచాయితీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

Supreme court on local elections: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ, ఉద్యోగ సంఘాలు దాఖలు చేసుకున్న పిటీషన్లను కొట్టివేసింది. ఈసీ వ్యవహారాల్లో కలగజేసుకోమని స్పష్టం చేసింది.

Last Updated : Jan 25, 2021, 02:53 PM IST
Supreme court on local elections: పంచాయితీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

Supreme court on local elections: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ, ఉద్యోగ సంఘాలు దాఖలు చేసుకున్న పిటీషన్లను కొట్టివేసింది. ఈసీ వ్యవహారాల్లో కలగజేసుకోమని స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాని ( Ap Government ) కి చుక్కెదురైంది. ఎన్నికల నిర్వహణ విషయమై హైకోర్టు ( High Court ) నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపధ్యంలో ఎన్నికల సంఘం ( Election Commission ), ప్రభుత్వం మధ్య ఆరోపణలు, ప్రత్యోరోపణలు చోటుచేసుకున్నాయి. సుప్రీంకోర్టులో ప్రభుత్వ, ఉద్యోగ సంఘాల పిటీషన్లపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ( Justice Sanjay kishan kaul ) నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. 

ఎన్నికలనేవి రాజ్యాంగ ప్రక్రియలో భాగమని..తరచూ వాయిదా వేయకూడదని సుప్రీంకోర్టు ( Supreme Court ) అభిప్రాయపడింది. మరోవైపు మీకేంటి సంబంధమని ఉద్యోగ సంఘాలు దాఖలు చేసుకున్న పిటీషన్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీ ( EC ) వ్యవహారాల్లో కలుగజేసుకోమని స్పష్టం చేస్తూనే..ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు వేసుకున్న పిటీషన్లను కొట్టివేసింది. పంచాయితీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ( Supreme court green signal to panchayat elections ) ఇచ్చింది. 

Also read: First vaccinated Mla: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి ఎమ్మెల్యే ఎవరో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News