Stampede at Chandrababu Meeting: బాబు సభలో అపశ్రుతి.. ఏడుగురు మృతి..8 మందికి తీవ్ర అస్వస్థత!

Stampede at Chandrababu Kandukur Meeting: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరులో ఒక చంద్రబాబు అధ్యక్షతన ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయగా ఈ సభలో తీవ్ర అపశృతి చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 28, 2022, 08:46 PM IST
Stampede  at Chandrababu Meeting: బాబు సభలో అపశ్రుతి.. ఏడుగురు మృతి..8 మందికి తీవ్ర అస్వస్థత!

Stampede at Chandrababu Kandukur Meeting: వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జెండా ఎగరవేయాలని భావిస్తున్న చంద్రబాబు అన్ని జిల్లాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లి అక్కడి శ్రేణులను కాస్త ఉత్తేజపరిచి వెనక్కి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు కోస్తా జిల్లాల మీద దృష్టి పెట్టారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరులో ఒక చంద్రబాబు అధ్యక్షతన ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

ఈ సభలో అపశృతి చోటు చేసుకుంది. బహిరంగ సభ దగ్గర తొక్కిసలాట ఏర్పడడంతో ఇద్దరు మృతి చెందగా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాట జరగడంతో వెంటనే పక్కనే ఉన్న కాలువలో పలువురు కార్యకర్తలు పడిపోయారని తెలుస్తోంది. అలా పడిపోయిన వారికి గాయాలు కాగా ఏడుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు.

నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం సాయంత్రం చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు తరలి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబు షెడ్యూల్ ప్రకారం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం చేపడుతున్నారు.

ఈరోజు నుంచి మూడు రోజుల పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఆయన పర్యటన సాగాల్సి ఉంది. ఈరోజు పూర్తిగా కందుకూరులో పర్యటించిన ఆయన సభలో ప్రసంగించారు ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. దీంతో గాయపడిన వారిని కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించగా సభ మధ్యలోనే ఆపి ఆస్పత్రికి వెళ్లిన చంద్రబాబు బాదితులను పరామర్శించారు.

బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చనిపోయిన వారికి పార్టీ తరపున పది లక్షలు ఆర్ధిక సహాయం చేస్తామని, వారి పిల్లల చదువు, పోషణ అంతా తెలుగుదేశమే చూసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఈ అపశ్రుతి నేపథ్యంలో కందుకూరు సభను క్యాన్సిల్ చేసుకుని వెనక్కు వెళ్లిపోయారు చంద్రబాబు. 

ఇక షెడ్యూల్ ప్రకారం రేపు, ఎల్లుండి - కావలి, కోవూరులో చంద్రబాబు పర్యటన సాగాల్సి ఉంది. కందుకూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఈ సభ జరగగా అక్కడే తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో పక్కనే ఉన్న గుడంకట్ట అవుట్లెట్ కెనాల్ లో కార్యకర్తలు పడిపోయినట్లు తెలుస్తోంది.

Also Read: Anam Ram Narayana Reddy: ఒక్క రోడ్డు వేయలేదు, అడుగుతుంటే ఏం చెప్తాం.. పెన్షన్లకు ఓట్లా?: జగన్ ప్రభుత్వంపై ఆనం విమర్శలు  

Also Read: 10th Class:ఏప్రిల్ 3 నుంచి 'పది' పరీక్షలు.. ఆరు పేపర్లతో నిర్వహణ.. కీలక మార్పులివే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News