IMD Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు

IMD Heavy Rains Alert: నైరుతి రుతుపవనాలు బలపడుతున్నాయి. ఇప్పటికే ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించడంతో వాతావరణం మారుతోంది. రానున్న మూడ్రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 11, 2024, 08:04 AM IST
IMD Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు

IMD Heavy Rains Alert: నైరుతి రుతు పవనాలు ఇవాళ ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్ర వరకూ వ్యాపించాయి. మరోవైపు పశ్చిమం నుంచి నైరుతి దిశలో తెలంగాణవైపుకు గాలులు వీస్తుండటంతో రుతు పవనాలు బలపడుతున్నాయి. ఫలితంగా రానున్న మూడ్రోజులు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 

తెలంగాణలోని కొమురం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్, మంచిర్యాల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, వనపర్తి, మహబూబ్ నగర్, నారాయణపేట్, గద్వాల్ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షం పడవచ్చు. మరోవైపు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నాగర్ కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు ఉరుములు, మెరుపులు ఉంటాయి. ఇక హైదరాబాద్‌లో ఇవాళ వాతావరణం మేఘావృతమై ఉండి మోస్తరు వర్షాలు పడనున్నాయి. రాత్రి సమయంలో ఈదురుగాలులు వీయనున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీలుండవచ్చని అంచనా. 

ఇక నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో రానున్న మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తర కోస్తాంధ్రలో రానున్న మూడ్రోజుల్లో ఉరుములు మెరుపులతో మోస్తరు వర్షాలు పడనున్నాయి. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు. ఇక దక్షిణ కోస్తాంధ్రలో  కూడా మోస్తరు వర్షాలు పడవచ్చు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని ఐఎండీ తెలిపింది.

Also read: AP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాల విడుదల, ఇలా చెక్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News