Smuggler: కానిస్టేబుళ్లను కారుతో తొక్కించిన స్మగ్లర్..!

Smuggler: కాకినాడ జిల్లాలో జాతీయ రహదారిపై గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు.  ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్త ఏడాది వేళ వాహన తనిఖీలు చేస్తుండగా వేగంగా వస్తున్న కారును ఆపే ప్రయత్నం చేసిన కానిస్టేబుల్స్  ను అమాంతం గుద్దుకుంటూ వెళ్లిన ఘటన కలకలం రేపింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 2, 2025, 03:45 PM IST
Smuggler: కానిస్టేబుళ్లను కారుతో తొక్కించిన స్మగ్లర్..!

Smuggler: అర్ధరాత్రి స్మగ్లర్లు రెచ్చిపోయారు.  అక్రమంగా సంపాదించిన ధనంతో బలిసి కొట్టుకుంటున్న స్మగ్లర్లు.. ఏకంగా కానిస్టేబుల్లను చంపే ప్రయత్నం చేయడం ఆంధ్ర ప్రదేశ్ లో కలకలం రేపింది. కారు ఆపేందుకు ప్రయత్నించిన   కానిస్టేబుళ్ల మీద నుంచి ఏకంగా కారు దూసుకుపోయిన ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా స్మగ్లర్ల తీరు చర్చనీయాంశంగా మారింది. కారు ఢీకొన్న ఘటనలో తీవ్ర గాయాల పాలైన కానిస్టేబుల్స్ ప్రస్తుతం ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నారు.

కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా వద్ద మంగళవారం రాత్రి జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్, కిర్లంపూడి ఎస్సై జి.సతీష్, కానిస్టేబుళ్లతో వాహన తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి సుమారు ఒంటి గంటన్నర సమయంలో విశాఖ పట్నం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న కారును పోలీసులు ఆపారు. రోడ్డు పక్కకు ఆపుతున్నట్లు నటించిన డ్రైవర్ ఒక్కసారిగా వేగంగా ముందుకు ఉరికించాడు. అప్పటికే ఆ వాహనం ముందు నిలుచున్న కిర్లంపూడి స్టేషన్ కానిస్టేబుల్ రాజి లోవరాజుతో పాటు మరో కానిస్టేబుల్‌ను కారు ఢీకొని దూసుకుపోయింది.

లోవరాజు అపస్మారక స్థితికి చేరుకోగా ఆసుపత్రికి తరలించారు. మరో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కారును రాజానగరం సమీపంలోని కెనాల్‌ వద్ద డ్రైవర్ వదిలి పరారయ్యాడు. వారిని పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో పట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News