Gudlavalleru Engineering College: గర్ల్స్‌ హాస్టల్స్‌ బాత్‌రూమ్స్‌లో హిడెన్ కెమెరాలు.. 300 మంది అమ్మాయిల వీడియోలు..!

Gudlavalleru Engineering College Incident: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మహిళలపై అఘాత్యాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు అమలు  చేసినా ఇవి ఆగడం లేదు. రీసెంట్ గా కోల్ కతా మెడికో రేప్ మరియు హత్యకు గురైన ఘటన మరవక ముందే మరో ఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని  కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరులో జరిగింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 30, 2024, 10:52 AM IST
Gudlavalleru Engineering College: గర్ల్స్‌ హాస్టల్స్‌ బాత్‌రూమ్స్‌లో హిడెన్ కెమెరాలు.. 300 మంది అమ్మాయిల వీడియోలు..!

Gudlavalleru Engineering College Incident:  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆడవాళ్లలో అభద్రత భావం నెలకొంది. ఎన్ని కఠిన చట్టాలు అమల్లో ఉన్న.. కొంత మంది కామాంధులు చేస్తోన్న పనికి మొత్తం సమాజం తలదించుకోవాల్సి వస్తోంది. తాజాగా కృష్ణా  జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన లేడీస్ హాస్టల్ బాత్రూమ్ లో 29వ తేది సాయంత్రం రహస్యంగా ఉంచి కెమెరా పట్టుబడింది. ఈ ఘటనతో ఆ ఇంజినీరింగ్ కళాశాలతో చదువుతున్న అమ్మాయిల్లో ఒక్కసారిగా  ఆందోళన నెలకొంది.

అమ్మాయిలకు తెలియకుండా కొంత మంది ఆకతాయిలు .. లేడీస్ హాస్టల్ బాత్రూమ్ లో ఎవరి కంట పడని హిడెన్ కెమెరాలతో దాదాపు 300 మంది అమ్మాయికు సంబంధించిన కొన్ని అభ్యంతరకర వీడియోలను హిడెన్ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. అంతేకాదు ఈ కెమెరాలను సమీపంలోని  బాయ్స్ హాస్టల్ లో కొంత మంది కొనుగోలు చేసి ఈ దుశ్చర్యలకు పాల్పడినట్టు తేలిపింది.

ఈ హిడెన్ కెమెరాలకు సంబంధించిన ఘటనలో ఒక స్టూడెంట్ సహకారంతో బాయ్స్ హాస్టల్ కు చెందిన కొంతమంది ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది.  దీంతో ఒక్కసారిగా ఇంజనీరింగ్ కళాశాలలో ఆడపిల్లలకు  న్యాయం  చేయాలంటే కోరుతూ ఉయ్ వాంట్ జస్టిస్ అనే నినాదాలతో హోరెత్తించారు. అంతేకాదు కళాశాల ప్రాంగణమంతా దద్దరిల్లేలా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా కాలేజీ యాజమాన్యం శాయశక్తుల కృషి చేసినట్టు  తెలుస్తోంది. దీంతో కాలేజీలోని విద్యార్థులు వాష్ రూమ్ కు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు నెలకున్నాయి.  దీనిపై ప్రభుత్వం వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అంతేకాదు ఈ దుశ్చర్యకు పాల్పడిన  నిందితులందరని బహిరంగంగా కఠినంగా శిక్షించాలని కోరారు.  ఇటువంటి చర్యలకు పాల్పడాలంటే వెన్నులో  వణుకు పుట్టేలా వారిపై ప్రభుత్వమే వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ ఘోర ఘటనకు పాల్పడిన వారిపై  తక్షణమే కఠిన శిక్ష విధించాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News