ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీలో ప్రచారాలు జోరందుకున్నాయి. టీడీపీ తరపున సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ సహా కీలక నేతలంతా ప్రచారంలో మునిగిపోయారు. వైసీపీ అధినేత జగన్ సైతం రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ బహిరంగ సభల్లో ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. దీనికి తోడు జగన్ తమ అమ్ముల పొదిలో ఉన్న అస్త్రశస్త్రాలను బయటకు తీస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ప్రచారంలోకి వైఎస్ విజయమ్మ ,షర్మిలను రంగంలోకి దించుతున్నారు.
మహిళ ఓటర్లే లక్ష్యంగా యాత్ర
వైసీపీ తరుఫున ప్రచారంలో భాగంగా షర్మిల, విజయమ్మ బస్సుయాత్ర నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ ఇద్దరికి వేర్వేరు ప్రచార రథాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. పార్టీ వీక్ గా ఉన్నప్రాంతాల్లో వీరు ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. కాగా మహిళా ఓటర్లను ఆకర్షించమే ప్రధాన లక్ష్యంగా వీరి ప్రచారం సాగనున్నట్లు తెలిసింది.
షర్మిల షెడ్యూల ఇదే..
షర్మిల ప్రచారం విషయాని వస్తే ఈ నెల నుంచి తన బస్సుయాత్ర ప్రారంభమౌతుంది. గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి, ఉత్రరాంధ్ర జిల్లాలను కవర్ చేస్తూ ఇఛ్ఛాపురం నుంచి షర్మిల బస్సుయాత్ర సాగనుంది. మొత్తం 10 జిల్లాల కవర్ అయ్యేలా షర్మిల బస్సుయాత్ర కొనసాగుతుంది. ఈ క్రమంలో దాదాపు 50 నియోజకవర్గాల్లో షర్మిల రోడ్ షో నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. గతంలో కూడా షర్మిల పాదయాత్రకు జనాలను నుంచి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ సారి ఆమె చరిష్మా ఏ మేరకు పనిచేస్తుందనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది
విజయమ్మ షెడ్యూల్ ఇదే..
ఇక విజయమ్మ విషయానికి వస్తే దాదాపు 40 నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు వైసీపీ ప్రణాళిక సిద్ధం చేసింది. రాజధాని ప్రాంతంతో పాటు పార్టీ వీక్ గా అనిపిస్తున్న నియోజకవర్గాలను విజయమ్మ కవర్ చేయనున్నారు. ఎన్నికల ముగిసే లోపు 40 నియోజకవర్గాలకు తగ్గకుండా విజయమ్మ చేత ప్రచారం చేయించాలని వైసీపీ శ్రేణులు టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం
జగనాస్త్రం పనిచేసేనా ?
2012లో చేపట్టిన పాదయాత్రలో భాగంగా తాను జగనన్న వదిలిన బాణాన్ని అని షర్మిల వ్యాఖ్యానించడం అందరినీ ఆకట్టుకుంది. అలాగే విజయమ్మ చేసిన ప్రచారం వైసీపీకి ప్రాణం పోసింది. అయితే జగన్ జైలు నుంచి వచ్చిన తర్వాత విజయమ్మ, షర్మిల పార్టీలో యాక్టివ్‌గా లేరు . ఈ నేపథ్యంలో వీరి ప్రచారం వైసీపీకి ఏ మేరకు కలిసి వస్తుందనేది చర్చనీయంశంగా మారింది.