దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో మూడు కొత్త రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రయాణీకుల రద్దీ దృష్టిలో పెట్టుకుని కొత్త రైళ్లను ప్రవేశపెట్టినట్టు రైల్వే తెలిపింది.
కోవిడ్ లాక్డౌన్( Covid lockdown ) అనంతరం ఇప్పుడు మళ్లీ రైల్వే ట్రాఫిక్ పెరుగుతోంది. అటు రైళ్లలో ప్రయాణీకుల రద్దీ కూడా ఎక్కువవుతోంది. పండుగ సీజన్లో మరి కాస్త పెరుగుతోంది. ప్రస్తుతం ప్రయాణీకుల రద్దీ పెరగడంతో వచ్చే వారం నుంచి రైల్వే శాఖ మూడు ప్రత్యేక రైళ్లు ( Special trains ) నడపనుంది. ఈ మూడు రైళ్లను విజయవాడ మీదుగా నడపడానికి రైల్వే శాఖ ( Railways ) నిర్ణయించింది.
డిసెంబర్ 9 నుంచి మచిలీపట్నం - యశ్వంతపుర్ ప్రత్యేక రైలు నెంబర్ 07211 సోమ, బుధ, శుక్రవారాల్లో నడవనుంది. మచిలీపట్నంలో మధ్యాహ్నం 3.50 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఇదే రైలు 07212 నెంబర్‌తో యశ్వంత్ పూర్ నుంచి మంగళ, గురు, శని వారాల్లో బయలు దేరుతుంది.
ఇక మరో రైలు కాకినాడ భావనగర్ టెర్మినస్ ప్రత్యేక రైలు నెంబర్ 07204 డిసెంబర్ 10 నుంచి కాకినాడలో ఉదయం 5.15 నిమిషాలకు బయలు దేరుతుంది. ఇదే రైలు 07203 నెంబర్‌తో ప్రతి శనివారం ఉదయం 4.25 నిమిషాలకు భావ నగర్ టెర్మినస్ నుంచి బయలుదేరుతుంది.
మరో వైపు ఇదే కాకినాడ పోర్టు స్టేషన్ నుంచి లోకమాన్య తిలక్ ప్రత్యేక రైలు ( Special train ) 07221 నెంబర్‌తో డిసెంబర్ 9 నుంచి బుధ, శనివారాల్లో ఉదయం 9 గంటలకు బయలు దేరుతుంది. అటు నుంచి అంటే లోకమాన్య తిలక్ నుంచి 07222 నెంబర్ తో గురు, ఆదివారాల్లో బయలు దేరుతుంది. Also read: Farmer protests: నేడు మరోసారి కేంద్రంతో రైతుల చర్చలు