Tirumala Temple: తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా స్వామిని దర్శించుకుంటున్నారు. అదే స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం రెట్టింపు అవుతోంది. తాజాగా తిరుమల శ్రీవారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఈసారి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. మే నెలలో రికార్డు స్థాయిలో రూ.130 కోట్ల ఆదాయం వచ్చింది. ఈమేరకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
ఒక నెలలో ఇంత భారీ స్థాయిలో ఆదాయం రావడం ఇదే తొలిసారి. లడ్డూ విక్రయాలు సైతం భారీగా జరిగాయి. మే నెలలో 22.62 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. టైమ్ స్లాట్ సర్వ దర్శన విధానం మళ్లీ ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. ఇందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని..త్వరలోనే టైమ్ స్లాట్ టోకెన్లను జారీ చేస్తామని తెలిపారు. దీనిని భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వీకెండ్‌లో శ్రీవారి దర్శనానికి అధిక సమయం కేటాయిస్తామని స్పష్టం చేశారు. శుక్ర, శని, ఆదివారాల్లో దర్శనానికి 48 గంటల సమయం కేటాయిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. కొండపై భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై నడకదారి భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు నిలిపివేయనున్నట్లు వెల్లడించారు.
Also read:Vastu Dosh Remedies: ఇంటి వాస్తు దోషాలకు చెక్ పెట్టే సులభమైన మార్గాలు ఇవిగో..!
Also read:Bus Charges Hike: విద్యార్థులను వదలని ఆర్టీసీ.. బస్ పాస్ చార్జీలు 150 శాతం హైక్
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Tirumala Temple: తిరుమలలో కాసుల పంట..స్వామి వారికి రికార్డు స్థాయిలో ఆదాయం..!
శ్రీవారి ఆలయానికి భక్తుల బారులు
శ్రీవారి హుండీ ఆదాయం రెట్టింపు
గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు ఆదాయం