హైదరాబాద్: బంగారు భవిష్యత్తు ఉన్న శక్తిమంతమైన సంపన్నుల జాబితా ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. వాణిజ్యం, వ్యాపారం, నటన, క్రీడల విభాగంలో భారత్ కు చెందిన 22 మంది యువ శక్తిమంతుల జాబితాను 'టైకూన్స్ ఆఫ్ టుమారో' పేరిట 'ఫోర్బ్స్ ఇండియా' విడుదల చేసింది. ఈ జాబితాలో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన, ఒలంపిక్ పతక విజేత పీవీ సింధులకు చోటు లభించడం గమనార్హం.
ఫోర్బ్స్ జాబితాలో నిలిచిన యువతరం :
* అపోలో ఫౌండేషన్ వైఎస్ ప్రెసిడెండ్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన
* తెలుగు తేజం, ఒలంపిక్ పతక విజేత పీవీ సింధు
* బిర్లా వారసురాలు, స్వతంత్ర మైక్రోఫైనాన్స్ వ్యవస్థాపకురాలు అనన్య బిర్లా
* ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్ ఈడీ అనంత్ గోయెంకా
* అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కరణ్ అదానీ
* ఫ్యూచర్ కన్స్యూమర్ ఎండీ ఆశ్ని బియానీ
* యస్ బ్యాంక్ సీఈఓ రాణా కపూర్ కుమార్తె, ది త్రీ సిస్టర్స్ ఫౌండర్ రాధా కపూర్
* క్లియర్ టాక్స్ ఫౌండర్ అర్చిత్ గుప్తా
* లోధా గ్రూప్ నకు చెందిన అభిషేక్ లోధా
* ఐడీ ఫ్రెష్ ఫుడ్ సహవ్యవస్థాపకుడు పీసీ ముస్తఫా
* ఫ్రెష్‌వర్క్స్ వ్యవస్థాపకుడు గిరీష్ మాత్రుబూతం
* జెరోధా సహవ్యవస్థాపకులు నిఖిల్ కామత్-నితిన్ కామత్,
* క్లియర్‌ట్యాక్స్ వ్యవస్థాకుడు ఆర్చిత్ గుప్తా
* మాసివ్ రెస్టారెంట్స్ వ్యవస్థాపకుడు జోరోవార్ కల్రా
* బిర్లా 91 బీర్ వ్యవస్థాపకుడు అంకుర్ జైన్, అమీరా షా
* బీబా అప్పారెల్ కు చెందిన సిద్ధార్థ్ బింద్రా
* పార్లే ఆగ్రోకు చెందిన నదియా చౌహాన్
* సియట్ కు చెందిన అనంత్ గోయెంకా
* యాపిల్ కు చెందిన విక్రమ్ ష్రాఫ్
* లోధా గ్రూప్ కు చెందిన అభిషేక్ లోధా
* ఓయో రూమ్స్ కు చెందిన రితేష్ అగర్వాల్
* నటులు విక్కీ కౌశల్, భూమి పెడ్నేకర్
ఆయా రంగాల్లో వారు చూపుతున్న ప్రతిభ, శక్తి సామర్థ్యాలుతో పాటు ప్రస్తుతం వీరి వ్యాపకం తదితరాలను పరిగణనలోకి ఈ జాబితా తయారు చేసినట్లు ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ జాబితా తయారీలో వారివారి నికర సంపదను ప్రామాణికంగా తీసుకోలేదని ఈ సందర్భంగా ఫోర్స్ ప్రతినిధి పేర్కొన్నారు.