Coronacrisis: కరోనా క్యారియర్లతోనే అధిక ప్రమాదం..

సమాజం సంక్షోభంలో ఉన్న సమయంలో విమర్శలకు, రాజకీయాలకు తావు ఉండకూడదని, అన్ని రాజకీయ పార్టీలు సమష్టిగా విపత్తును ఎదుర్కోడానికి సహకరించాలని, విపత్తులో కలసి రావడానికి తెలుగుదేశం ఎల్లప్పుడూ సిద్ధం ఉంటుందని ప్రభుత్వానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ముందు మూడు సవాళ్ళున్నాయని,  ఒకటి.. కరోనా నియంత్రణ, రెండు..  ఇబ్బందుల్లో

Last Updated : Mar 27, 2020, 10:14 PM IST
Coronacrisis: కరోనా క్యారియర్లతోనే అధిక ప్రమాదం..

అమరావతి: సమాజం సంక్షోభంలో ఉన్న సమయంలో విమర్శలకు, రాజకీయాలకు తావు ఉండకూడదని, అన్ని రాజకీయ పార్టీలు సమష్టిగా విపత్తును ఎదుర్కోడానికి సహకరించాలని, విపత్తులో కలసి రావడానికి తెలుగుదేశం ఎల్లప్పుడూ సిద్ధం ఉంటుందని ప్రభుత్వానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ముందు మూడు సవాళ్ళున్నాయని,  ఒకటి.. కరోనా నియంత్రణ, రెండు..  ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడం, మూడు... భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులకు పరిష్కారం కనుక్కోవడమని, వీటన్నిటినీ ఎదుర్కోడానికి ఒక సమగ్ర ప్రణాళికతో, ప్రతిపక్షాలను సైతం కలుపుకొనిపోవాలని సూచించారు. 

మరోవైపు టీడీపీకి చెందిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమహేంద్రవరంలో స్వయంగా శానిటైజింగ్ స్ప్రే చేసి ప్రజలకు పరిశుభ్రతను పాటించడం ఎంతటి అత్యవసరమో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ  కలిగి ఉన్నప్పుడే విపత్కర పరిస్థితులను ఎదుర్కోగలమన్నారు. 

కరోనా సోకినప్పటికీ వెంటనే వ్యాధి లక్షణాలు బయటపడవని, కానీ ఈ దశలో ఆ వ్యక్తి ద్వారా ఇతరులకు కరోనా వ్యాపించవచ్చు. వీరినే కరోనా క్యారియర్లు అంటామని, దేశంలో ప్రస్తుతం కరోనా ఈ క్యారియర్ దశలో ఉంది కాబట్టి ఒకరికొకరు సామాజిక దూరం పాటించడం చాలా అవసరమని చంద్రబాబు అన్నారు.  

 
కాగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్త కరోనా బాధితులలో వయోధికులు ఎక్కువ కావడంతో పిల్లలకు, యువతకు కరోనా రాదనే అపోహ చాలామందిలో ఉందని, అది తప్పని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోందని, తెలంగాణలో మూడేళ్ళ చిన్నారికి కరోనా లక్షణాలు కనపడటం ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News