CM Jagan Govt On Old Pension Scheme: ప్రస్తుతం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు నుంచి డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్ విధాన్ని అమలు చేస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తుండడంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. తమకు కూడా పాత పెన్షన్ విధానమే కావాలంటూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు. అదేవిధంగా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పాత పెన్షన్ అమలు చేస్తామని రాజకీయ పార్టీలు హామీలు ఇస్తున్నాయి. దీనిపై నిపుణులందరితో పాటు ఆర్బీఐ కూడా భవిష్యత్‌లో కష్టమేనని తేల్చిచెప్పింది. అయితే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్ స్కీమ్ గురించి చర్చలు జరుపుతోంది.
కొత్త, పాత పింఛను రెండింటికి సంబంధించిన నిబంధనలు చేర్చినట్లు తెలుస్తోంది. దీనికి ప్రభుత్వం గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) అని పేరు పెట్టింది. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి ప్రతిపాదనను ఆర్థిక శాఖకు పంపలేదని సమాచారం. జగన్ ప్రభుత్వం దీనిపై కసరత్తు చేస్తోందని నిపుణులు చెబుతున్నారు.
గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ అంటే..?
ఇందులో రెండు నిబంధనలు ఉన్నాయి. జీపీఎస్ కింద ఒక ఉద్యోగి ప్రతి నెలా తన బేసిక్ జీతంలో 10 శాతం డిపాజిట్ చేస్తే.. రిటైర్మెంట్ తర్వాత తన జీతంలో 33 శాతం పెన్షన్‌గా పొందవచ్చు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా 10 శాతం జీపీఎస్‌లో జమ చేస్తుంది. ఇది మొదటిది. రెండోది ఏంటంటే.. ఉద్యోగి తన జీతంలో 14 శాతం డిపాజిట్ చేస్తే.. పదవీ విరమణ తర్వాత అతనికి 40 శాతం వరకు పెన్షన్ లభిస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయడానికి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతించలేదు. ఇది చాలా ఆసక్తికరమైన మోడల్ అని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అయితే దీనిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని చెబుతున్నారు. పాత పెన్షన్ స్కీమ్ కింద.. రిటైర్మెంట్ తరువాత ఉద్యోగి చివరి జీతంలో 50 శాతం పెన్షన్ పొందేవారు. పింఛనుగా వచ్చిన ఈ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించింది.
అయితే పాత పెన్షన్ స్థానంలో నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటే కొత్త పెన్షన్ సిస్టమ్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకం పదవీ విరమణ తర్వాత ఉద్యోగి ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు పొందుతారు. ఇందులో పెట్టుబడి పెట్టే వాళ్లకు 80-సీసీడీ (1బీ) కింద రూ.50 వేల తగ్గింపు లభిస్తుంది. ఇది కాకుండా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు రాయితీ లభిస్తుంది.
Also Read: Turkey Earthquake: భారీ భూకంపం సమయంలో మహిళ ప్రసవం.. కుప్పకూలిన భవనాల కింద పసికందు సేఫ్
Also Read: RBI Hikes Repo Rate: లోన్లు తీసుకున్న వారికి షాక్.. మళ్లీ పెరిగిన వడ్డీ రేట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook