అమెరికాకు వెళ్లనున్న పవన్ కల్యాణ్.. డల్లాస్‌లో జనసేన సభ ?

అమెరికాకు పవన్ కల్యాణ్.. డల్లాస్‌లో జనసేన సభ ?

Last Updated : Dec 8, 2018, 12:52 PM IST
అమెరికాకు వెళ్లనున్న పవన్ కల్యాణ్.. డల్లాస్‌లో జనసేన సభ ?

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 14న అమెరికాకు వెళ్లనున్నారు. గత రెండు, మూడు నెలలుగా ఆంధ్రాను చుట్టేస్తున్న పవన్ కల్యాణ్.. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లోగా పార్టీ సిద్ధాంతాలను, కార్యాచరణను ఎన్నారైలకు వివరించి వారిని కూడా పార్టీ పట్ల ఆకర్షితులను చేయాలనే యోచనతోనే ఈ పర్యటన చేపట్టినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ నెల 15న డల్లాస్‌లో జనసేన ప్రవాస గర్జన పేరుతో జరిగే జనసేన కవాతులో పవన్‌ కల్యాణ్‌ పాల్గొననున్నారని సమాచారం.

ఇదిలావుంటే, ఇటీవలే అనంతపురంలో పవన్ కల్యాణ్ చేపట్టిన కవాతుకు భారీ స్పందన లభించిన సంగతి తెలిసిందే. అనంతపురం కవాతులో పాల్గొనేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానుల భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా అనంతవాసులు ఎదుర్కుంటున్న కరువుపై ప్రత్యేక దృష్టిసారించినట్టు పవన్ కల్యాణ్ తెలిపారు.

Trending News