Pawan Kalyan - Janasena: జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ సారి ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్‌లోని పిఠాపురం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. పోలింగ్‌కు మరో రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన మనసులో మాటను జీ తెలుగు న్యూస్‌తో పంచుకున్నారు. ఈ సందర్బంగా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ఈ సందర్భంగా తనకు కేంద్ర కేబినెట్‌లోకి వెళ్లాలన్న ఆలోచన తనకు లేదన్నారు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చేరే ఉద్దేశ్యం తనకు లేదన్నారు. తనకు పదవులపై మక్కువ లేదున్నారు. తాను పదవుల కోసం రాజకీయాల్లో రాలేదు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే పాలిటిక్స్‌లోకి వచ్చానన్నారు. జనం కోసమే మాటలు పడ్డానని ఏదో ఒక రోజు గెలిస్తానని ధీమా వ్యక్తం చేసారు.
మరోవైపు ఫ్యాన్ ఫాలోయింగ్‌తో ఓట్లు పడవనే సంగతి తనకు తెలుసన్నారు. మరోవైపు ప్యాకేజ్ స్టార్ అన్నపుడు పెద్దగా పట్టించుకోలేదు. నాయకులకు విమర్శకులు కామన్. అవేమి నేను పట్టించుకోలేదు. జగన్‌లాగా తన దగ్గర దోచుకున్న డబ్బులు లేవు. సంక్షేమ పథకాలతో ఎవరి కడుపు నిండదు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఆంధ్ర ప్రదేశ్‌లో 19 నుంచి 20 సీట్లు గెలుస్తుందనే నమ్మకం తమకు ఉందన్నారు.
రాజకీయం అంటే కత్తులతో చేసే యుద్ధం కాదన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి విజయం ఖాయం. ఎన్నికల్లో జగన్ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం. ప్రజలు జగన్‌ను సాగనంపేందుకు రెడీ అయ్యారు. అది ఓట్ల రూపంలో కనిపించబోతుంది.
అంతేకాదు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ స్థిరత్వం కోసమే బీజేపీ, టీడీపీతో జతకట్టిన విషయాన్ని ప్రస్తావించారు. జగన్ పరిపాలనంతా రివర్స్ టెండరింగ్, పాలసీ టెర్రరిజమని విమర్శించారు. ఒక్కోసారి వైసీపీ వాళ్ల మాటలకు ఒక్కొసారి చెప్పు చూపించాలని అనిపిస్తుందన్నారు. కూటమి విజయం ఖాయమని.. భారీ మెజార్టీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తనకు సీఎం కూర్చీపై ఆశ లేదన్నారు.
Also Read: IPL SRH vs LSG: ఉప్పల్‌లో హైదరాబాద్ అదుర్స్.. 10 ఓవర్లలోనే 10 వికెట్ల తేడాతో తిరుగులేని విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter