Nellore: తిరుపతి ఘటన మరవకముందే.. నెల్లూరులోనూ సేమ్ సీన్... బైక్‌పై బాలుడి మృతదేహం తరలింపు...

Boy dead body carried on bike:  108 అంబులెన్స్ సిబ్బంది రామన్నారు... ఆటో వాళ్లను అడిగితే కుదరదన్నారు... దీంతో చేసేదేమీ లేక బాలుడి మృతదేహాన్ని బైక్‌ పైనే ఇంటికి తరలించారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 5, 2022, 10:26 AM IST
  • నెల్లూరులో హృదయ విదారక ఘటన
  • 108 అంబులెన్స్ సిబ్బంది నిరాకరణ.. బైక్‌పై మృతదేహం తరలింపు
  • స్థానికులను కంటతడి పెట్టించిన ఘటన
Nellore: తిరుపతి ఘటన మరవకముందే.. నెల్లూరులోనూ సేమ్ సీన్... బైక్‌పై బాలుడి మృతదేహం తరలింపు...

Boy dead body carried on bike: నెల్లూరు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చనిపోయిన ఓ బాలుడి మృతదేహాన్ని తరలించేందుకు 108 అంబులెన్స్ సిబ్బంది నిరాకరించారు. ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలు కూడా మృతదేహాన్ని తరలించేందుకు ముందుకు రాలేదు. దీంతో చేసేదేమీ లేక బైక్‌ పైనే బాలుడి మృతదేహాన్ని ఇంటికి తరలించారు. ఈ ఘటన బాలుడి కుటుంబ సభ్యులతో పాటు స్థానికులను కంటతడి పెట్టించింది. ఇటీవల తిరుపతిలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకోగా... ఆ ఘటన మరవకముందే నెల్లూరులోనూ సేమ్ సీన్ రిపీట్ అవడం చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే... నెల్లూరు జిల్లా సంగం పట్టణంలో శ్రీరామ్ (8), ఈశ్వర్ (10) అనే ఇద్దరు బాలురు బుధవారం (మే 4) బహిర్భూమి కోసం బయటకు వెళ్లారు. ఈ క్రమంలో కనిగిరి రిజర్వాయర్ కెనాల్ వద్దకు వెళ్లిన బాలురు ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లారు. మొదట శ్రీరామ్ మృతదేహం బయటపడగా వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

అయితే అప్పటికే శ్రీరామ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని ఇంటికి తరలించాల్సిందిగా శ్రీరామ్ బంధువులు 108 అంబులెన్స్ సిబ్బందిని కోరారు. అయితే నిబంధనల పేరు చెప్పి వారు కుదరదని తేల్చేశారు. ఆటోలో తరలించాలని చూసినా... ఆటో డ్రైవర్లు ఎవరూ ముందుకు రాలేదు. ఇతర ప్రైవేట్ వాహనాలు కూడా ముందుకు రాకపోవడంతో... ఇక చేసేదేమీ లేక బైక్ పైనే మృతదేహాన్ని తరలించారు. 

ఈ ఘటన శ్రీరామ్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులను కంటతడి పెట్టించింది. శ్రీరామ్‌తో పాటు ప్రమాదవశాత్తు కెనాల్‌లో పడిపోయిన ఈశ్వర్ కూడా మృతి చెందాడు. శ్రీరామ్ మృతదేహం బయటపడిన కాసేపటికి అతని మృతదేహం లభించింది. 

కొద్ది రోజుల క్రితం తిరుపతిలోనూ ఇలాంటి ఘటన : 

కొద్ది రోజుల క్రితం తిరుపతి రుయా ఆసుపత్రిలోనూ ఇలాంటి ఘటన జరిగిన సంగతి తెలిసిందే. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ జాషువా (10) అనే బాలుడు ఆసుపత్రిలో మృతి చెందగా... అతని మృతదేహాన్ని తరలించేందుకు 108 అంబులెన్స్ సిబ్బంది రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బైక్‌ పైనే కొడుకు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లాడు అతని తండ్రి. దాదాపు 90 కి.మీ బైక్‌పై మృతదేహంతో ప్రయాణించాడు. ఈ ఘటన మరవకముందే నెల్లూరులో ఇదే ఘటన రిపీట్ అవడం చర్చనీయాంశంగా మారింది. 

Also Read: Love Proposal In CSK vs RCB: క్రికెట్‌ స్డేడియంలో లవ్‌ ప్రపోజల్‌, ఒకే చెప్పిన అబ్బాయి

Also Read: నన్ను ఇస్లాంలోకి మారమని షాహిద్ అఫ్రిది ఒత్తిడి తెచ్చాడు: భారత స్పిన్నర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News