కరోనా వైరస్ (CoronaVirus) నేపథ్యంలో గ్రామాలకు సైతం పరిచయమైన పదం శానిటైజర్ (Sanitizer). చేతులు శుభ్రం చేసుకునేందుకు వాడాల్సిన ఈ శానిటైజర్‌ను తాగిన ఘటన (Prakasam Sanitizer Deaths)లో 9 మంది మరణించారు. ఈ విషాదం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. మద్యం దొరకక ‘ఆల్కాహాల్’ శానిటైజర్‌ను తాగడంతో ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. Viral Video: ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం
జిల్లాలోని కురిచేడు మండల కేంద్రంలోని అమ్మవారి ఆలయం కొందరు యాచకులు ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా ఏపీలో మద్యం దొరకడం లేదు, దానికితోడు లాక్డౌన్ లాంటి కారణాలతో సమస్యలున్నాయి. మద్యానికి బానిసైన యాచకులు కొన్ని రోజులుగా శానిటైజర్ తాగుతున్నారు. తీవ్రంగా కడుపునొప్పి కొందరిని ఆస్పత్రికి తరలించారు. గురువారం ముగ్గురు వ్యక్తులు చనిపోగా, శుక్రవారం మరో ఆరుగురు మరణించారని తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య 9కి చేరింది. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...
కడుపులో నొప్పి అని విలవాల్లాడుతున్న కొందర్ని దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మొత్తం ముగ్గురు మరణించారు. పోలీస్ స్టేషన్ సమీపంలో నివాసం ఉండే కడియం రమణయ్య(28) శానిటైజర్, నాటు సారా కలిపి తాగుతుండగా చూసిన స్థానికులు వద్దని వారించారు. అలాగే తాగి ఇంటికి వెళ్లిపోయిన రమణయ్య రాత్రి అపస్మారక స్థితికి చేరుకోగా కుటుంబసభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అప్పటికే చనిపోయినట్లు వైద్యులు గుర్తించారు. Corona Vaccine: రెండు వారాల్లో రష్యా కరోనా వ్యాక్సిన్!
మృతులను రమణయ్య(65), రాజారెడ్డి(65), గుంటక రామిరెడ్డి(60), భోగెమ్ తిరుపతయ్య(37), అనుగొండ శ్రీను (25) గా గుర్తించారు. మరికొందరి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కురిచేడులో లాక్డౌన్ విధించారు. దీంతో మద్యం దొరకక స్థానికులు పలువురు శానిటైజర్‌కు అలవాటుపడుతున్నారని తెలుస్తోంది. Photos: బుల్లితెర రారాణి అంకితా లోఖాండే..
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్