అసెంబ్లీలో మంత్రులను పలకరిస్తూ సందడి చేసిన నారా లోకేష్

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో ప్రస్తుత కేబినెట్ మంత్రులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను పలకరిస్తూ సందడి చేశారు.

Last Updated : Jun 14, 2019, 10:35 AM IST
అసెంబ్లీలో మంత్రులను పలకరిస్తూ సందడి చేసిన నారా లోకేష్

అమరావతి: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో ప్రస్తుత కేబినెట్ మంత్రులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను పలకరిస్తూ సందడి చేశారు. తనకు ఎదురైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కరచాలనం చేస్తూ వారిని ఆత్మీయంగా పలకరించిన వైనం అసెంబ్లీ లాబీల్లో ప్రత్యేకంగా కనిపించింది. ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, మంత్రులు ఆనం రాంనారాయణ రెడ్డి, ఆదిమూలపు సురేష్‌లకి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజును లోకేష్ నమస్తే అంటూ పలకరించిన తీరు సైతం అక్కడున్న వారి దృష్టిని ఆకట్టుకుంది.

ఇదిలావుంటే, క్రితంసారి ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా వున్నప్పుడు నారా లోకేష్‌కి కేటాయించిన చాంబర్‌ని ప్రస్తుత కేబినెట్‌లో రాష్ట్ర గనులు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి కేటాయించగా అది ఆయన తిరస్కరించిన సంగతి తెలిసిందే. నారా లోకేష్‌కి కేటాయించిన చాంబర్ తనకు వద్దని అధికారులకు సూచించగా వారు ఆయనకు మరో చాంబర్‌ని కేటాయించారు.

Trending News