నకిలీ ట్విట్టర్ ఖాతాల వివాదంలో నారా లోకేష్?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ఖాతాకి సంబంధించిన వివాదం ఒకటి ఆన్‌లైన్‌లో ఆసక్తికరమైన చర్చను లేవనెత్తుతోంది. 

Last Updated : Jul 5, 2018, 04:08 PM IST
నకిలీ ట్విట్టర్ ఖాతాల వివాదంలో నారా లోకేష్?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ఖాతాకి సంబంధించిన వివాదం ఒకటి ఆన్‌లైన్‌లో ఆసక్తికరమైన చర్చను లేవనెత్తుతోంది. పలువురు నెటిజన్లు ట్వీట్స్ ద్వారా విన్నవించుకుంటున్న సమస్యలకు నారా లోకేష్ ఇటీవలే రిప్లై ఇచ్చారు. అయితే అలా రిప్లై పొందిన ట్వీట్స్ అన్నీ కూడా నకిలీ ఖాతాల నుండి వస్తున్నట్లు పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

కేవలం ఏదో హైప్ క్రియేట్ చేయడం కోసమే నకిలీ ఖాతాలు తయారుచేసి.. వాటికి ద్వారా వచ్చే దొంగ ట్వీట్స్‌కు లోకేష్ ప్రత్యుత్తరం ఇస్తున్నారని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఎందుకంటే.. లోకేష్‌కు ట్వీట్ చేస్తున్నవారికి పెద్దగా ఫాలోవర్లు లేకపోవడమే ఇక్కడ ప్రధాన సమస్య. జీరో ఫాలోవర్లు ఉన్న ఖాతాలు, పెద్దగా ట్విట్టర్‌లో యాక్టివ్‌గా లేని ఖాతాల ద్వారా వచ్చే ట్వీట్స్‌కి లోకేష్ ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం కావడం లేదని పలువురు తమ సందేహాలను కూడా వెల్లిబుచ్చారు. 

సాధారణంగా ట్విటర్‌లో యాక్టివ్ ఉన్నవారి ఖాతాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిన విషయం. రెగ్యులర్‌గా ట్వీట్స్ చేస్తూ.. మంచి ఫాలోవర్ల సంఖ్య కలిగి ఉన్నవారు ట్వీట్స్ చేస్తే ఒక అర్థం అనేది ఉంటుంది. అలా కాకుండా అప్పటికప్పుడు ట్విటర్ ఖాతా ప్రారంభించి.. ఏదో సమస్య పోస్టు చేసి.. మంత్రికి ట్యాగ్ చేస్తే ఫేక్ అకౌంట్‌దారులకు లోకేష్ ఎందుకు స్పందిస్తున్నారని పలువురు నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తాను సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండి జనాల సమస్యలపై స్పందిస్తున్నానని లోకేష్ ఈ విధంగా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని.. అందుకే తెలుగుదేశం సోషల్ మీడియా టీమ్ సూచనలతో నకిలీ ఖాతాలా ద్వారా వచ్చే ట్వీట్స్‌కి స్పందిస్తున్నారని వినికిడి. ప్రస్తుతం ఈ విషయం బట్టబయలు అయ్యింది కాబట్టి.. తెలుగుదేశం పార్టీ ఈ విషయంపై ఎలాంటి స్పందన తెలియజేస్తుందనేది వేచి చూడాల్సిన విషయమే. 

 

Trending News