AP Assembly Elections: ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకువెళ్తుండగా.. టీడీపీ, జనసేన జంటగా రాజకీయ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆ మూడు పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. వైసీపీ అధినేత సీఎం జగన్ తన ప్రసంగంలో డోస్ పెంచి విభిన్నమైన శైలిలో ప్రసంగం చేసి ఆకట్టుకుంటున్నారు. ఇక టీడీపీ మాత్రం కుర్చీ మడతపెట్టి' అనే డైలాగ్‌ను పట్టుకుంది. తాజాగా నారా లోకేశ్, గుడివాడ అమర్‌నాథ్ మధ్య ఆసక్తికర సవాల్ జరిగాయి.
విశాఖపట్టణంలో జరిగిన శంఖారావం బహిరంగ సభలో నారా లోకేశ్ మాట్లాడుతూ.. మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు ఊహించని కానుక ప్రకటించారు. 'మీ శాసన సభ్యుడికి ఒక కానుక తీసుకువచ్చా. ఆంధ్ర రాష్ట్ర పరువు తీసిన మంత్రికి కోడిగుడ్డు ఇవ్వాలనుకుంటున్నా. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రరాష్ట్ర పరువు తీసిన గుడివాడ అమర్‌నాథ్‌కు పంపించాలని కోరుతున్నా' అని చెప్పి ఓ డబ్బాను తెరిచాడు. ఆ డబ్బాలో కోడిగుడ్లు ఉన్నాయి.
Also Read: Aadhaar Update: గుడ్‌న్యూస్.. ఆధార్ అప్డేట్ కోసం ప్రత్యేక కేంద్రాలు.. ఎక్కడ అంటే..?
ఇక నారా లోకేశ్ కానుకపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పందించారు. అంతే ధీటుగా నారా లోకేశ్‌కు ఘాటు రీతిలో అమర్‌నాథ్ బదులిచ్చారు. మట్టికుండలో ముద్ద పప్పు వండి లోకేశ్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. 'ఎవరైనా గిఫ్ట్ ఇస్తే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం ఉత్తరాంధ్ర ప్రజల సంప్రదాయం. మింది గ్రామంలోని కుమ్మరులు మట్టికుండలో లోకేష్ కు ఇష్టమైన ముద్దపప్పును తయారుచేసి లోకేశ్‌కు పంపిస్తున్నా. ఉత్తరాంధ్రను ఏమాత్రం అభివృద్ధి చేయకుండా వదిలేసిన ఈ తండ్రీకొడుకులు సిగ్గు లేకుండా ఈ ప్రాంతానికి వచ్చి మాపై విమర్శలు చేయటం విడ్డూరంగా ఉంది. వారికి సిగ్గు వచ్చేందుకు ఈ పప్పులో ఉప్పు, కారం కలిపాం' అని మంత్రి అమర్నాథ్ చెప్పారు.
ఇలా ఏపీ రాజకీయాలు ముద్దపప్పు, కోడిగుడ్డు చుట్టూ తిరిగాయి. కోడిగుడ్డు ప్రస్తావన రావడం వెనుక గతంలో గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. తెలంగాణలో జరిగిన ఫార్మూలా రేస్ ప్రారంభోత్సవం సందర్భంగా అమర్‌నాథ్ 'కోడిగుడ్డు ఇంకా పొదగలేదు' అని వ్యాఖ్యానించారు. ఇక నారా లోకేశ్‌కు ముద్దపప్పు పంపడం వెనుక ఓ కారణం ఉంది. 'లోకేశ్ రాజకీయాల్లో ఓనమాలు తెలియని వ్యక్తి. ఇంకా పరిజ్ఞానం తెలియని దద్దమ్మ' అనే రీతిలో విమర్శించేందుకు 'ముద్దపప్పు'గా పిలుస్తారు. పప్పు వంటకానికి అంబాసిడర్‌గా లోకేశ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇలా ఏపీ రాజకీయాలు హాట్‌హాట్‌గా కొనసాగుతూ ప్రజలకు కావాల్సిన వినోదం అందిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook