అమరావతి: భారత్-సింగపూర్ వ్యాపార ఆవిష్కరణల సదస్సులో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వైసీపీ సర్కార్ తీరును నారా లోకేష్ తప్పుబట్టారు. అమరావతి నిర్మాణానికి నిధుల్లేవని భారత్-సింగపూర్ వ్యాపార, ఆవిష్కరణల సదస్సు వేదికగా బుగ్గనగారు చెప్పడం సిగ్గుచేటన్నారు. అలా చెప్పే బదులు అమరావతిని నిర్మించడం తమకు ఇష్టం లేదని చెప్పాల్సిందిగా అంటూ చురకలు అంటించారు. ప్రధాని దగ్గరకు వెళ్ళి రాజధాని నిర్మాణానికి ఇప్పుడే నిధులు ఇవ్వక్కరలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పొచ్చారు. గుర్తులేదా బుగ్గనగారు? అంటూ ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ ప్రశ్నించారు.
అమరావతి నిర్మాణానికి నిధుల్లేవని భారత్-సింగపూర్ వ్యాపార, ఆవిష్కరణల సదస్సు వేదికగా బుగ్గనగారు చెప్పడం సిగ్గుచేటు. దానికి బదులు మాకిష్టం లేదని చెప్పాల్సింది. ప్రధాని దగ్గరకు వెళ్ళి రాజధాని నిర్మాణానికి ఇప్పుడే నిధులు ఇవ్వక్కరలేదని @ysjagan గారు చెప్పొచ్చారు. గుర్తులేదా బుగ్గనగారు? pic.twitter.com/rk5AEsEhH3
— Lokesh Nara (@naralokesh) September 12, 2019
ప్రముఖ తెలుగు మీడియా కథనం ప్రకారం భారత్-సింగపూర్ వ్యాపార ఆవిష్కరణల సదస్సు సందర్భంలో అవరావతి అంశంపై సింగూపూర్ ప్రముఖ పత్రిక ''స్టెయిట్స్ టైమ్స్'' ఇంటర్వ్యూలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ రాజధాని అమరావతి నిర్మించడానికి తమ దగ్గర డబ్బులేమని స్పష్టం చేశారు. అమరావతి నగరం ఉద్దేశించి మాట్లాడుతూ అభివృద్ధిని ఒకే నగరానికి పరిమితం చేసేకంటే ...అన్ని ప్రాంతాలకు విస్తరించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఈ నేపథ్యంలో ఆర్ధిక మంత్రి బుగ్గన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ నారా లోకేష్ ఈ మేరక స్పందించారు.