టీడీపీకి షాక్: జనసేన తీర్ధం పుచ్చుకున్న నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి

                 

Last Updated : Mar 20, 2019, 10:01 PM IST
టీడీపీకి షాక్: జనసేన తీర్ధం పుచ్చుకున్న నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ నేత గా గుర్తింపు పొందిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి జనసేన పార్టీలో చేరారు. బుధవారం సాయంత్రం తన కుమార్తెతో కలిసి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 

గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి కొన్నాళ్ల కిందట టిడీపీలో చేరారు. ఈ సారి ఎన్నికల్లో ఆయనకు టీడీపీ టికెట్ కేటాయించకపోవడంతో అలకబూనిన ఆయన ..టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. ఈ క్రమంలో ఎస్పీవై రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. 

సరిగ్గా ఇదే సమయంలో   జనసేన వ్యూహకర్తలు అదను చూసి రంగంలోకి దిగారు.  జనసేన తరఫున నంద్యాల ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వడంతో  ఎస్పీవై రెడ్డి పవన్ పార్టీలో చేరిపోయారు. కాగా ఈ పరిణామం టీడీపీ వర్గాలకు మింగుడుపడని చర్యగా మిగిలిపోగా..రాయలసీమలో ఎస్పీవై రెడ్డి వంటి బలమైన నేతను జనసేన ఆకర్షించగల్గింది.

Trending News