AP Local Body Elections 2020 Schedule: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేష్‌కుమార్‌ మాట్లాడుతూ.. మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహస్తామని తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఒక విడతలో, పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహిస్తామని రమేష్ కుమార్ వెల్లడించారు. 

Last Updated : Mar 7, 2020, 01:18 PM IST
AP Local Body Elections 2020 Schedule: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే

అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేష్‌కుమార్‌ మాట్లాడుతూ.. మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహస్తామని తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఒక విడతలో, పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహిస్తామని రమేష్ కుమార్ వెల్లడించారు. 

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమైన తేదీలు
మార్చి 7: నోటిఫికేషన్‌ విడుదల 
మార్చి 9-11: నామినేషన్ల స్వీకరణ
మార్చి 12: నామినేషన్ల పరిశీలన
మార్చి 14: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 21: ఎన్నికల పోలింగ్‌
మార్చి 24: ఓట్ల లెక్కింపు

మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమైన తేదీలు
మార్చి 9: నోటిఫికేషన్‌ విడుదల
మార్చి 11-13: నామినేషన్ల స్వీకరణ
మార్చి 14: నామినేషన్ల పరిశీలన
మార్చి 16: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 23: ఎన్నికల పోలింగ్‌
మార్చి 27: ఓట్ల లెక్కింపు

పంచాయతీ ఎన్నికలు తొలి విడతకు సంబంధించి ముఖ్యమైన తేదీలు
మార్చి 15: నోటిఫికేషన్‌ విడుదల
మార్చి 17-19: నామినేషన్ల స్వీకరణ
మార్చి 20: నామినేషన్ల పరిశీలన
మార్చి 22: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 27: ఎన్నికల పోలింగ్‌
మార్చి 27: ఓట్ల లెక్కింపు

పంచాయతీ ఎన్నికల రెండో విడత షెడ్యూల్‌‌కి సంబంధించి ముఖ్యమైన తేదీలు
మార్చి 17: నోటిఫికేషన్‌ విడుదల
మార్చి 19-21: నామినేషన్ల స్వీకరణ
మార్చి 22: నామినేషన్ల పరిశీలన
మార్చి 24: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 29: ఎన్నికల పోలింగ్‌
మార్చి 29: ఓట్ల లెక్కింపు

Trending News