Ram mohan nayudu: తెలంగాణ ప్రజల కోసం దేనికైనా రెడీ.. మరోసారి ప్రజల మనస్సులు టచ్ చేసిన రామ్మోహన్ నాయుడు..

Ram mohan nayudu: కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు చేసిన వ్యాఖ్యలు తెలుగు స్టేట్స్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఆయనకు మోదీ 3.0 కేబినేట్ లో పౌరవిమానయాన మంత్రిత్వశాఖను కేటాయించిన విషయం తెలిసిందే.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 11, 2024, 05:08 PM IST
  • తెలుగు ప్రజల కోసం దేనికైన రెడీ..
  • రామ్మోహన్ నాయుడుపై ప్రశంసలు..
Ram mohan nayudu: తెలంగాణ ప్రజల కోసం దేనికైనా రెడీ.. మరోసారి ప్రజల మనస్సులు టచ్ చేసిన  రామ్మోహన్ నాయుడు..

Tdp Mp Rammohannayudu emotional on telangana: దేశంలో ప్రస్తుతం మోదీ ౩.౦ హవా కొనసాగుతుంది. మోదీ హ్యట్రిక్ పీఎంగా ఇటీవల ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. మోదీతోపాటుగా మరో 71 మంది కూడా కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ ప్రమాణ స్వీకారం అట్టహసంగా జరిగింది. దేశ, విదేశాల నుంచి వీఐపీలు, వీవీఐపీలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో.. సోమవారం రోజులు పీఎంవోలో బాధ్యతలు స్వీకరించిన మోదీ, అదేరోజు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కూడా కేటాయించారు. ముఖ్యంగా రెండు తెలుగు తెలుగు స్టేట్స్‌కు కూడా మోదీ పెద్ద పీట వేశారు.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి బొగ్గు మోదీ కేబినేట్ లో తెలుగు రాష్ట్రాల మంత్రులకు కీలక శాఖలను కేటాయించారు. కేబినేట్ విస్తరణలో మోదీ తన మార్కు చూయించారు.  తెలంగాణ బీజేపీ చీఫ్, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి కేంద్రం బొగ్గు, గనుల శాఖను కేటాయించారు. గతంలో కిషన్ రెడ్డి, హోంశాఖ సహయ మంత్రిగా,పర్యాటకం, ఈశాన్యరాష్ట్రాల డెవలప్ మెంట్ శాఖా మంత్రిగాను పనిచేసిన విషయం తెలిసిందే. బండి సంజయ్.. కు ఈసారి మోదీ హోంశాఖ సహాయ మంత్రిగా అవకాశం కల్పించారు.

గతంలో తెలంగాణ బీజేపీరాష్ట్ర ప్రెసిడెంట్ గా పనిచేశారు.   ఇక ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడుకు.. పౌరవిమానాయాన శాఖ బాధ్యతలు అప్పగించారు. గతంలో కూడా.. 2014 లో ఎన్డీయే  ప్రభుత్వంలో ఉన్న టీడీపీకి ఇదేశాఖను కేటాయించారు. అశోక్ గజపతి రాజు ఈ కేబినేట్ మంత్రిగా పనిచేశారు. ఇక పెమ్మసాని చంద్రశేఖర్ కు.. రూరల్ డెవలప్ మెంట్, కమ్యూనికేషన్స్, శాఖలను ఇచ్చారు. గుంటూరు నుంచి పెమ్మసాని భారీ మెజార్టీతో గెలుపొందారు.  ఉక్కు, భారీశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలను అప్పగించారు. ఇరు తెలుగు రాష్ట్రాలకు కూడా మోదీ కీలక శాఖలకు కేటాయింపులు చేశారని ప్రజలు ఎంతో జోష్ తో ఉన్నారు. 

ఇదిలా ఉండగా.. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన కేంద్రమంత్రులకు విషేస్ చెప్పారు. అదే విధంగా.. మన తెలుగు స్టేట్స్ నుంచి రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నారని, ఆయన ద్వారా తెలంగాణకు విమానయానం నుంచి మరిన్ని, ఎయిర్ పోర్టులు వచ్చేలా సహకారం కోరుతామన్నారు. ఇక తెలంగాణలో హైదరాబాద్ లో మాత్రమే ఎయిర్ పోర్టులు ఉన్నాయి. మరికొన్ని చోట్ల కూడా ఎయిర్ పోర్టుల కోసం ప్రయత్నాలుచేస్తామన్నారు.

Read more: Viral Video: కొంప ముంచిన సెల్ఫీ సరదా.. వైరల్ గా మారిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

ఇక దీనిపై తాజాగా, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం తన వంతు సహకారం సంపూర్ణంగా ఉంటుందన్నారు. కేంద్ర మంత్రి పదవి ద్వారా తెలంగాణ ప్రజలకు చేరువయ్యే అవకాశం కల్గిందని రామ్మోహన్ నాయుడు అన్నారు.

తెలంగాణ నుంచి సీఎం , కేంద్ర మంత్రులు ఎలాంటి ప్రపోజల్ వచ్చిన కూడా తనవంతుగా తప్పకుండా సహయపడతానంటూ రామ్మోహన్ నాయుడు అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య మంచి సోదర అనుబంధం ఉండటమే తమకు కావాలని రామ్మోహన్ నాయుడు  అన్నారు.  ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ కూడా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులకు విషేస్ చెప్పారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News